కీర్తి శేషులు శ్రీ. రాణీ ప్రకాశ శర్మ గారు గురించి కొన్ని మంచి మాటలు
ర్యాలీ గ్రామ వాస్తవ్యులు , హరితస గోత్రికులు , రాణీ వారి వంశస్తులు , సూర్య పుత్రులు (తండ్రి గారు సూర్య నారాయణ ), నిత్య ఆదిత్య హృదయ పఠనం / సుందర కాండ పారాయణులు , పరమ భాగవతోత్తములు అయిన మా తండ్రి గారు సూర్య ప్రకాశములు
కఠినత,నియమము,నిష్టయు, తో అఖుంటిత దీక్ష తో,
హఠమున ముద్రలు సలుపగ అంగుళి తోడన్
చేతిన నొసటస అడ్డ విభూతి పట్టె
చెలగె సంప్రదాయ శిఖయె శిరమునందు ధరించే,
రక్షణ కై గాయత్రి , సుందరాకాండ పారాయణ చేయు మా తండ్రి గారికి గారికి ముందుగా పాదాభివందనం
మా నాన్నగారు భాషా ప్రవీణులు తో పాటు డిగ్రీ ని కూడా పూర్తి చేసి , అనేక ప్రైవేట్ కంపెనీ లో పని చేసి చివరిగా ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడి రిటైర్మెంట్ జీవితం ను కూడా ఒక ప్రణాళిక గా తయారుచేసుకున్న వ్యక్తి ,
తండ్రి గారు శ్రీ రాణీ సూర్య నారాయణ గారు ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల లో ఉపాధ్యాయులు గా పనిచేసి, ఎందరెందరి కో మంచి విద్యని అందించి , మంచి రంగాలలో నిపుణులు అయ్యే విధం గా తయారు చేసిన విద్యా దానం చేసేన మహానుభావులు.. ఆయనది చాల మెత్తని స్వభావం. దయార్ద్ర హృదయులు. వారి సంతానం అందరు ప్రభుత్వ రంగం లో పనిచేసి చివరికి రిటైర్మెంట్ లోను , చివరి దశ వరకు కూడా ఎవరిమీద ఆధార పడకూడదు అనే సంకల్పం తో వారిని ఆశీర్వదించిన మహా వ్యక్తి. పాఠశాలలో తెలుగు అధ్యాపకుని గా పనిజేసి రిటైర్మెంట్ ని అదే కల ను సార్ధకం చేసుకోలేకపోయారు.
ఇక మా నాన్నగారు అయిన రాణీ వెంకట సూర్య ప్రకాశం శర్మ గారు పరమ శివ భక్తులు. తానూ నమ్ముకున్న సూర్య భగవానుడు ని ప్రతి నిత్యమూ ఆదిత్య హృదయం పారాయణ తో ప్రార్ధించే వారు.. , అలాగే సుందరా కాండ పఠనం ఎప్పుడు చేస్తూనే ఉండేవారు .. ఏ కష్టం , సుఖం వచ్చిన ఆ స్వామి హనుమతో చెప్పుకునే వారు , సుందరా కాండ పారాయణ రూపం లో స్వామి కి తన విన్నపం ను తెలియచేసే వారు.. మా నాన్నగారు ఎప్పడు సుందరా కాండ పారాయణ చేసిన ఆ స్వామి వారు మా ఇంటికి కోతి రూపం లో వచ్చే వారు .. స్వామి ఉన్నారు అనే నమ్మకం అయన ని ముందుకు నడిపించేది
మా నాన్నగారు మహర్షిలా జీవితాన్ని గడిపే వారు .. చివరికి మౌన ముని లా తనలో తానె రమిస్తూ ఒక రమణ మహర్షి లా మా అందరికీ కనిపించే వారు.
చిన్న వయస్సు లోనే సంస్కృతాంధ్రాలను తన తండ్రి గారు వద్ద నేర్చుకున్న వ్యక్తులు మా నాన్నగారు , వారి అన్నదమ్ములు . వాళ్ళు ఆరుగురులు
మా నాన్న గారి చెంత కూర్చున్న చాలును
మాకు పట్టువడెడి వరము దొరకు!
వారు కరుణ తోడ నేరుపు మంత్రము
భావి తరాల పదిల పరచు బాట యగును!
కానీ ఇక మాకా అదృష్టం కరువయ్యెను
ఆలా మా నాన్నగారు / మా నాన్నమ్మ మా చిన్నతం నుంచి మా అందరికీ బోలెడు కధలు మంచి విషయాలు నేర్పించారు .
చెప్పువారు లేక చింతింతు రెందరో
చెప్ప గలను నేను చేర రండు
అనెడి మా నాన్నమ్మ గారి కాయుష్షనంతమై
రాణీ వారి వంశం వృధ్ది చెందు గాత!
ఆలా మా నాన్నగారు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఉంటుంది.. ఎందుకంటే జీవితం ను కాచి వడపోసిన మహా మనిషి.
మనకి లాక్ డౌన్ లో కొంత ఇబ్బంది అయినా ఆ సమయాన్ని నేను కొంత సద్వినియోగ పరిచినను
లాక్ డౌన్ మొదలు అయినా దగ్గర నుంచి నిత్యం భాగవతం, ఈశ్వర సేవ, అలాగే మా తండ్రి గారు తో చాల సమయం గడపడం , పుస్తకాలూ చదవడం మొ.. చేసాము
అప్పుడు తెలిసింది మనం గడిపిన కాలం, కొన్న పుస్తకాలూ, అసలు ఏమి జరిగింది ఇన్ని సం.. అని రీలు తెప్పను.
ఎన్నో ఫ్లాష్ బ్యాక్ లు, రింగులు రింగులు తిరిగాయి.. ఇక పుస్తకాలూ అలమారు దగ్గరకి వెళ్ళాను మా నాన్నగారు చదివిన పుస్తకాలూ , కొన్న పుస్తకాలూ చూసాను , అది ఒక గ్యాన నిధి, భాండాగారం అనిపించింది , మా నాన్నగారు అంటే అనుభవాల గనులు, స్వాతంత్య్రానికి పూర్వమే పుట్టిన మనిషి కదా.. ఎంత కష్టపడి తే కానీ ఈ స్థాయి లో ఉన్నారు.. ఇప్పుడంటే మా నాన్నగారు వృధాప్యం లో ఉన్నారు ,
ఒక్క నాడు తలకి రంగు వెయ్యని వారు జుట్టు తెల్లబడిన కేశాలవాడు మా నాన్నగారు , అంతర్గతంగా తలపండిన పండితుడు అని అయన చదివిన పుస్తకాలు చుస్తే తెలిసింది . మా నాన్న గారు బాహ్యంగానే గాదు అంతరంగా కూడా తల పండిన వృద్ధుడే.
మా నాన్నగారు ఫోటోస్ అన్ని ఒకచోట పొందుపరచి ఆల్బం చేసి చూస్తుంటే తెలిసింది అయన ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు అయ్యారు అని. వృధాప్యం లో ఉన్న తల్లిదండ్రులు ని ఎవరిని పలకరించినా చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాళ్ళు అవుతారు, ఎందుకంటే వాళ్ళ గత సృతులు ని గుర్తు చేస్తాయి కాబట్టి..
చివరిగా మనం లాక్ డౌన్ పేరు తో కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటె ఏమి చెయ్యాలో ఒక్కోసారి తెలియని పరిస్థితి.. బయటకి వెళ్లలేని , తిరగలేని వాళ్ళం అయ్యాము , మా నాన్నగారు ని చూసినప్పుడల్లా అదే అనిపిస్తోంది.. ఎన్ని సం నుంచి లాక్ డౌన్ లో ఉంటున్నారో ...
ఎప్పుడు చుసిన మా నాన్నగారు కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికం గా ఎదో నామస్మరణా చేసుకుంటూనే ఉంటారు.. అదే వారికీ శ్రీ రామ రక్ష
ఇప్పటికే నాన్నగారు ని ఉదయమే నిద్ర లేపాలి సూర్యోదయం కి ఎదురుగా వీల్ చైర్ లో కూర్చుపెడితే ఆ ఆదిత్యుని చూస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటూ జపించుకుంటూ ఉంటారు . మా నాన్నగారు కి ఏ కష్టం వచ్చిన , మంగళ కరం జరిగిన ఆ స్వామి వారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ సుందరాకాండ పారాయణ చేసుకుంటారు.. ఎందుకంటే మనమందరం పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు కాబట్టి.. రోజు సాయంత్రం మా నాన్నగారు ని తయారు చేసి మా గవాక్యం లో కూర్చోబెడితే మా ఇంటిని కాచే ఈశ్వరుడు మా నాన్నగారు ,మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం.
మా నాన్నగారు కి ఈ వయసులో కూడా అలుపెరకుండా , విరామం విశ్రాంతి ని కూడా పక్కన పెట్టి సేవ చేస్తున్న మా తల్లిగారుకు ఇదే మా నమస్సుమాంజలి లోకం లో అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి , కనిపించే దేవత అమ్మ అయితే నడిపించే దైవం నాన్న!ప్రేమించడం అమ్మ వంతయితే.. దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న.
నాకు ఈశ్వర సేవ ఎంత ముఖ్యమో అంత కన్నా గొప్పది పితృసేవ అని నా అభిప్రాయము. నాన్నగారు కి స్నానం చేయిస్తుంటే రుద్రుడి కి అభిషేకం చేస్తున్న భావన తో స్నానం సమర్పయామి అన్నట్టు,పౌడర్ ,తిలక ధారణ విభూది ధారణ చేస్తున్నపుడు స్వామికి అలంకరణ చేస్తున్నట్టుగా భావిస్తున్నాను.స్వామి వారికి చెయ్యాలిసిన ఉపచారాలు అన్ని నాన్నగారికి ప్రత్యక్ష ముగా చేస్తున్న భావనతో చేస్తున్నాను..అంతకంటే ఏమి కావాలి..
అయన జీవితం ఒక "ప్రకాశ" వంతం మాకు ఇచ్చారు ఒక "సూర్య" వంశం ను .. ఆయన పేరులోనే గాదు, జీవితంలో గూడా సూర్య ప్రకాశమే, ఆయన "మానసం" నిండా కృష్ణుడే కనుకనే మా యింట కృష్ణ మానసయై వెలిసింది
మాకు రాణి యును, వాణి యు, సూర్యయు, శర్మ గా ఈ లోకమునుకు పరిచయ చేసి మమ్మల్ని ఉజ్వలంగా ఉంచడానికి పడ్డారు ఎంతో కష్టం, మాకునొక బ్రద్కును జూపిన మీకు దండముల్.
ఒక రకం గా మా నాన్నగారు వారి చిన్న తనం లో చాల కష్టపడ్డారు.. మా అమ్మ ఈ విషయం ను మాకు చాల సార్లు చెప్పేది.. వినే అవకాశం నాకు లభించింది..
పాపం మా అమ్మగారు మా నాన్నగారు చివరి నిమిషం వరకు ఎనలేని సేవ చేసారు..
చిన్న పిల్లలకి ఎలా సేవ చేస్తారో అలాగే చేసి మా నాన్నగారు మంచి గా హాయిగా పడుకుంటే అప్పుడు నేను అమ్మ ఆలా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం..
మా అమ్మగారు వారి చిన్న తనం విశేషాలు , పడ్డ కష్టాలు , మా నాన్నగారు జీవితం గురించి చాల సార్లు చెప్పింది.. మా నాన్నగారు పడ్డ కష్టం మాములు కష్టం కాదు..
మా అమ్మ చాల సార్లు అంటూ ఉంటుంది.. వెర్రి బ్రాహ్మణుడు అని.. నిజమే
మా నాన్నగారు ని ఒక ఆదర్శం గా తీసుకుంటే జీవితం సాఫీగా వెళుతుంది.. ఎవరిని ఇబ్బంది పెట్టె వారు కాదు
ఎలా అంటే
ధర్మానువర్తన మర్మమ్ము లెరిగిన
విమల చరిత్రుడౌ విప్రు డితడు!
భాస్కరానుగ్రహమ్మును బడసె నితడు!
సంస్కృతాంధ్రమ్ము లందున చతురుడితడు!
తండ్రి పదమునకే గొప్ప పరువితండు!
అన్నట్టు గా మా జీవితానికి ఒక మార్గ దర్శకునిగా నిలిచారు..
సశేషం
ఇట్లు
ప్రకాశం ఫామిలీ