వృద్ధాప్యం అనివార్యంగా అవస్థతో కూడుకుని ఉంటుంది . మన జీవన ప్రవాహంలో వయసంతా కొట్టుకుపోయాక మిగిలిన కొసరులో అంతా మిగిలినది వృద్దాప్యమే .
ఆ వృద్ధాప్యం అంటా అనుభవాల గనులే గ్యాపకాల దొంతరలే ..
వృద్ధులంతా నిన్నటి బాలలే. నేటి బాలలంతా రేపటి వృద్దులే. వయసుకు ఎవ్వరూ అతీతులు కాదు. ఈ విషయం ప్రతి మనిషికి తెలుసు కానీ ముందుకు వెళ్లి పోతున్నాం అని తెలిసి కూడా మనిషి స్వార్థంతోనే జీవిస్తాడు. మరణం ఉందని తెలిసి కూడా ఆశల కొక్కానికి వేలాడ బడుతుంటాడు. ఇక్కడ మనిషి నైజం విచిత్రంగా అనిపించినా ..జీవితం అంటే అదే !
జీవితం లో జీ(వి)తం కూడా ఉంటుంది కదా.. దాని కోసమే తాపత్రయం
మనిషి మారడు. జీవితం కూడా మారదు. అదే బాల్యం... అదే యవ్వనం... అదే ప్రౌడత్వం... అదే ముసలితనం... ఆ తర్వాత అంతా శూన్యం!
జీవిత ప్రయాణంలో ఎవ్వరి గమ్యం ఎంతవరకో ఎవ్వరికి తెలియదు. కాగా ఇక్కడ జీవితం చివరి అంకం వరకు గమ్యం సాగించిన వాళ్ళను మనం అదృష్ట వంతులుగా భావిస్తుంటాం. అంత జీవితం మనకు కూడా కలగాలని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాం.
No comments:
Post a Comment