ఈ రోజు నారద మహా ముని జయంతి అని గుర్తు చేసినందుకు ధన్యవాదములు అందరికీ తెలిసినదే..కానీ తక్కువ మందికి ఆ మహా ముని గురించి తెలుసుకుంటారు..
మనకి శ్రీ మద ఆంధ్ర మహా భారతం లోను మరియు భాగవతం లో నారదోపాఖ్యానం ఉంటుంది..
మన దౌర్భాగ్యం ఏమిటంటే మన సినిమాలలో నారదులు వారి ని ఒక కలహ ప్రియుడు గా అభివర్ణించారు
మా పూజ్య గురువు గారు శ్రీ మద్ భాగవతం లో నారదులు వారి చరిత్ర అయన గురించి ఎంతగానో వర్ణించారు..
నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నిరంతరం ధర్మరక్షణ కోసం తపించే హరిభక్తుడు మంచికి చెడులకు జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే.
నారద మహర్షి ఎంతో మంది సాత్విటీలకు ఆయన మోక్షమార్గాన్ని చూపించారు. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషించేవాడు. అయితే కొంతమంది. మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను కలహభోజనుడు'గా, 'కలహప్రియుడు"గా అభివర్ణించారు.
ఈ లోకం తీరే అంత... నిజం మాట్లాడేవారికి ఎప్పుడు కష్టాలే అందుకే అన్నారేమో యదార్థవాది లోకవిరోధి. ఈ లోకంలోను, పురాణ కథల్లోను ధర్మ పరాయణులకు ఎప్పుడు కష్టాల్లో ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్న చూపు వారిని లోకవిరోధులుగానే భావిస్తారు. అనేక కష్టాలకు గురిచేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, దానవ, మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్యబోధ చేసేవాడు. అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశారు. నారదుడిది ఒక ఉద్దేశ్యం ధర్మ ప్రతిష్టాపన.
"నార” అనగా మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ద అనగా ఇచ్చేవాడనే అర్థం ఉంది. కర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో దుడు. అంతేకాదు నారథుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. భగవంతుడైన b. ఆయనకు ఎంతో ఇష్టం తంత్రీవాద్యం, 'వీణ'ను కూడా కనిపెట్టింది. అయన వీణ పేరు మహతి
వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారదుని నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతా వివరిస్తుంది. నారద పురాణం, పంచరాత్రులు మొదలైన కూడా నారదునికి సంబంధించినవే అలాగే నారద భక్తి సూత్రాలు అనే ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించాడు. ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించాడు. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై నారద మహర్షి తనదైన పాత్రను పోషించాడు
ఆయన వచ్చాడంటేనే తగవు... అది సత్యాకృష్ణుల మధ్యే కానీ..
బలరామకృష్ణులే అవనీ.. కృష్ణార్జునులే అయినా..
నిప్పు రాజేస్తే సెగ మొదలే.. అయితే ప్రతి రణం వెనక
కలహభోజుడు.. ఇదీ బిరుదు
నారదుడు వచ్చి వెళ్ళాక
గొడవ జరక్కపోవడం అరుదు..
ఇక్కడి కబుర్లు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ..
ఏదైనా మంచికే.. చివరకు దుర్మార్గం కథ కంచికే..!
చేతిలో మహతి.. శ్రీహరి శరణాగతి..
నిరంతర నారాయణ నామపారాయణ..మెడలో మాల..
తలకు ముడి..కాళ్లకు పావుకోళ్లు..
కాషాయ వస్త్రాలు..బుర్ర నిండా శాస్త్రాలు...
మాటల అస్త్రాలు.. చూపుల శస్త్రాలు..
విష్ణువుకు ఇష్టుడు..బ్రహ్మకు బేటా..
ఇదీ నారదుడి బయోడేటా..ఇవన్నీ ఇంకెవరికీ రావే..
ఆయన మాత్రం అచ్చం కాంతారావే..!(మన సినిమాలలో )
ఈ నారదుడే వ్యాసుడి చేత రాయించినాడు భారతం..
వాల్మీకికి ప్రబోధించినాడు
నారదుని పాత్ర లేనిదే రక్తి కట్టదు ఏ పురాణం..
హిట్టు కొట్టదు పౌరాణిక చిత్రం..
రావణుడి కోపానికి..సత్యభామ విలాపానికి..
కిట్టయ్య సల్లాపానికి..నరనారాయణ రణానికి..
రామాంజనేయ యుద్ధానికి కృష్ణాంజనేయ సమరానికి..
మంచోళ్లు ఏ ఇద్దరి మధ్య యుద్ధం జరిగినా
అక్కడ ఆనందంగా నారదయ్య సిద్ధమే..
పేరుకే తంపులు.. చెడుకే తలవంపులు..!
ఓ లోకోత్తర కారణం..
తంటా వెంట ఒక పంట..
కయ్యం సద్దుమణిగినాక కళ్యాణం..అదే నారద పురాణం..!
No comments:
Post a Comment