Tuesday, January 31, 2023

బీష్మ ఏకాదశి

కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.

కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.

భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.

***********************************************

భీష్మ ఏకాదశి
||ॐ||ఓం నమోనారాయణాయ || ॐ ||

ॐ అంపశయ్యపై శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనముతెలియపరచాలని, అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికితెలియపరచాలని భావించాడు.

ॐ భీష్మునిలోనిభగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన నెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహం తోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజు కు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో… వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో

ॐ “కిమేకిం దైవతం లోకే” అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?

ॐ “కింవా ప్యేకం పరాయణం”- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?

ॐ స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన

ॐ కం అర్చయంతః – ఎవరిని అర్చించడం/ పూజించడం వలన

ॐ ప్రాప్యుః మానవః శుభం – మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.

ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః – అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?

ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?

అని అడుగుతాడు.

ॐ జగత్ ప్రభుం – ఈ జగత్తుకు ప్రభువైన వాడు

ॐ దేవదేవం – దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు

ॐ అనంతం – అంతం అంటూ లేని వాడు, అంతటావ్యాపించి ఉన్నవాడు

ॐ పురుషోత్తమం అందరిలో కెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు

ॐ స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః – ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో ………….

అంటూ మొదలుపెట్టి “విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః……” అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను (1000 నామాలను) ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.

ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.

ॐ ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు

“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||”

ఈ పైశ్లోకం చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానం!! ఇది పార్వతీ దేవికి పరమ శివుడు వివరించాడు!!

Sunday, August 14, 2022

అష్టాదశపురాణాల్లో

 వ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాల్లో.. ఏ పురాణంలో ఏముందంటే..

మత్స్యపురాణం
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏంటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
కూర్మపురాణం
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
వామన పురాణం
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించిన వర్ణన ఉంటుంది. 
వరాహపురాణం
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
గరుడ పురాణం
గరుడుడి వివిధ సందేహాలపై విష్ణుమూర్తి చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు,  ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి. 
వాయుపురాణం
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి.
అగ్నిపురాణం
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.
స్కాందపురాణం
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి ఇందులో ఉంటుంది. 
కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
లింగపురాణం
లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటూ ఖగోళ, జ్యోతిష్యం గురించి ఉంటుంది.
నారద పురాణం
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది. 
పద్మపురాణం
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
విష్ణుపురాణం
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది.
ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
మార్కండేయ పురాణం
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
బ్రహ్మపురాణం 
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాసమహర్షి.  
భాగవత పురాణం
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శకమహర్షి చెప్పాడు. శుకుడికి మొదట వ్యాసుడు బోధించాడు. 
బ్రహ్మాండ పురాణం
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. 
భవిష్య పురాణం
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.
బ్రహ్మాపవైవర్తపురాణం
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి
ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

https://archive.org/stream/in.ernet.dli.2015.492513/2015.492513.ashhtaadasha-puraand-akathaa_djvu.txt

Saturday, August 13, 2022

MY NOTES...

 

వృద్ధాప్యం అనివార్యంగా అవస్థతో కూడుకుని ఉంటుంది . మన జీవన ప్రవాహంలో వయసంతా కొట్టుకుపోయాక  మిగిలిన కొసరులో  అంతా మిగిలినది వృద్దాప్యమే . 
ఆ వృద్ధాప్యం అంటా అనుభవాల గనులే గ్యాపకాల దొంతరలే .. 
వృద్ధులంతా నిన్నటి బాలలే. నేటి బాలలంతా రేపటి  వృద్దులే.  వయసుకు  ఎవ్వరూ అతీతులు కాదు. ఈ విషయం ప్రతి మనిషికి  తెలుసు కానీ  ముందుకు వెళ్లి పోతున్నాం అని తెలిసి కూడా  మనిషి  స్వార్థంతోనే జీవిస్తాడు. మరణం  ఉందని  తెలిసి కూడా  ఆశల కొక్కానికి వేలాడ బడుతుంటాడు. ఇక్కడ మనిషి  నైజం  విచిత్రంగా అనిపించినా ..జీవితం అంటే అదే !
జీవితం లో జీ(వి)తం కూడా ఉంటుంది కదా.. దాని కోసమే తాపత్రయం 
మనిషి మారడు. జీవితం కూడా  మారదు. అదే బాల్యం... అదే యవ్వనం... అదే ప్రౌడత్వం... అదే ముసలితనం... ఆ తర్వాత అంతా శూన్యం!
జీవిత ప్రయాణంలో ఎవ్వరి గమ్యం ఎంతవరకో  ఎవ్వరికి తెలియదు. కాగా ఇక్కడ జీవితం చివరి  అంకం వరకు  గమ్యం సాగించిన వాళ్ళను మనం  అదృష్ట వంతులుగా భావిస్తుంటాం. అంత జీవితం మనకు  కూడా  కలగాలని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాం. 

Tuesday, May 17, 2022

నారద మహా ముని జయంతి

 ఈ రోజు నారద మహా ముని జయంతి అని గుర్తు చేసినందుకు ధన్యవాదములు అందరికీ తెలిసినదే..కానీ తక్కువ మందికి ఆ మహా ముని గురించి తెలుసుకుంటారు..

మనకి శ్రీ మద ఆంధ్ర మహా భారతం లోను మరియు భాగవతం లో నారదోపాఖ్యానం ఉంటుంది.. 

మన దౌర్భాగ్యం ఏమిటంటే మన సినిమాలలో నారదులు వారి ని ఒక కలహ ప్రియుడు గా అభివర్ణించారు 

మా పూజ్య గురువు గారు శ్రీ మద్ భాగవతం లో నారదులు వారి చరిత్ర అయన గురించి ఎంతగానో వర్ణించారు.. 

నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నిరంతరం ధర్మరక్షణ కోసం తపించే హరిభక్తుడు మంచికి చెడులకు జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే.

నారద మహర్షి ఎంతో మంది సాత్విటీలకు ఆయన మోక్షమార్గాన్ని చూపించారు. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషించేవాడు. అయితే కొంతమంది. మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను కలహభోజనుడు'గా, 'కలహప్రియుడు"గా అభివర్ణించారు.

ఈ లోకం తీరే అంత... నిజం మాట్లాడేవారికి ఎప్పుడు కష్టాలే అందుకే అన్నారేమో యదార్థవాది లోకవిరోధి. ఈ లోకంలోను, పురాణ కథల్లోను ధర్మ పరాయణులకు ఎప్పుడు కష్టాల్లో ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్న చూపు వారిని లోకవిరోధులుగానే భావిస్తారు. అనేక కష్టాలకు గురిచేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, దానవ, మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్యబోధ చేసేవాడు. అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశారు. నారదుడిది ఒక ఉద్దేశ్యం ధర్మ ప్రతిష్టాపన.

"నార” అనగా మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ద అనగా ఇచ్చేవాడనే అర్థం ఉంది. కర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో దుడు. అంతేకాదు నారథుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. భగవంతుడైన b. ఆయనకు ఎంతో ఇష్టం తంత్రీవాద్యం, 'వీణ'ను కూడా కనిపెట్టింది. అయన వీణ పేరు మహతి 

వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారదుని నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతా వివరిస్తుంది. నారద పురాణం, పంచరాత్రులు మొదలైన కూడా నారదునికి సంబంధించినవే అలాగే నారద భక్తి సూత్రాలు అనే ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించాడు. ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించాడు. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై నారద మహర్షి తనదైన పాత్రను పోషించాడు

ఆయన వచ్చాడంటేనే తగవు... అది సత్యాకృష్ణుల  మధ్యే కానీ..

బలరామకృష్ణులే అవనీ.. కృష్ణార్జునులే అయినా..

నిప్పు రాజేస్తే సెగ మొదలే.. అయితే ప్రతి రణం వెనక


కలహభోజుడు..  ఇదీ బిరుదు

నారదుడు వచ్చి వెళ్ళాక 

గొడవ జరక్కపోవడం అరుదు..

ఇక్కడి కబుర్లు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ..

ఏదైనా మంచికే.. చివరకు దుర్మార్గం కథ కంచికే..!


చేతిలో మహతి.. శ్రీహరి శరణాగతి..

నిరంతర నారాయణ నామపారాయణ..మెడలో మాల..

తలకు ముడి..కాళ్లకు పావుకోళ్లు..

కాషాయ వస్త్రాలు..బుర్ర నిండా శాస్త్రాలు...

మాటల అస్త్రాలు.. చూపుల శస్త్రాలు..

విష్ణువుకు ఇష్టుడు..బ్రహ్మకు బేటా..

ఇదీ నారదుడి బయోడేటా..ఇవన్నీ ఇంకెవరికీ రావే..

ఆయన మాత్రం అచ్చం కాంతారావే..!(మన సినిమాలలో )


ఈ  నారదుడే వ్యాసుడి చేత రాయించినాడు భారతం..

వాల్మీకికి ప్రబోధించినాడు 

నారదుని పాత్ర లేనిదే  రక్తి కట్టదు ఏ పురాణం..

హిట్టు కొట్టదు పౌరాణిక చిత్రం..

రావణుడి కోపానికి..సత్యభామ విలాపానికి..

కిట్టయ్య సల్లాపానికి..నరనారాయణ రణానికి..

రామాంజనేయ యుద్ధానికి కృష్ణాంజనేయ సమరానికి..

మంచోళ్లు ఏ ఇద్దరి మధ్య యుద్ధం జరిగినా 

అక్కడ ఆనందంగా నారదయ్య సిద్ధమే..

పేరుకే తంపులు.. చెడుకే తలవంపులు..!

ఓ లోకోత్తర కారణం..

తంటా వెంట ఒక పంట..

కయ్యం సద్దుమణిగినాక కళ్యాణం..అదే నారద పురాణం..!

Monday, September 13, 2021

భాద్రపదమాసం శుద్ధ అష్టమి రాధాష్టమి

 



ప్రియమైన శివ పరివారం కు  కి రాధా అష్టమి శుభాకాంక్షలు

రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ

కృష్ణ ప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణస్వరూపిణీ

కృష్ణ వామాంగ సంభూతా పరమానంద రూపిణీ

కృష్ణా బృందావనీ బృందా బృందావనవినోదినే చంద్రావళీ 

చంద్రకాంత శరచ్చంద్రనిభాననా నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ 
 
భాద్రపదమాసం శుద్ధ అష్టమి ఈ దినమే రాధాష్టమి అని అంటారు.(14-09-21) 
రాధా కృష్ణులు మా ఇంటి దేవతలు . మా తండ్రి గారు కి మా తండ్రి గారు పూజ్య గురువులు కి ఆరాధ్య దైవం , అంతటా రాధా భజే శ్యామలం 

భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. 
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి,విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
 శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.

వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం ‘రాధామాధవం’.


ఇట్లు 
వాణి నా రాణీ 


కచుడు-దేవయాని- శుక్రాచార్యుడు

Date : 13-09-21

ప్రియమైన శివ పరివారం కు భాద్రపద మాస శుభాకాంక్షలు 

మనకి శ్రీ మద ఆంధ్ర bhaaratam కవిత్రయం వారి నిత్యా ప్రవచనం ల ఈ రోజు గురువు గర్ 

కచుడు-దేవయాని- శుక్రాచార్యుడు  గురించివిషయాలు తెలియచేసారు. 

శుక్రాచార్యుడు కి తెలిసిన విద్య అయిన మృత సంజీవిని గురించి తెలియచేసారు.. మనకి కరోనా మహమ్మారి విజృమన సమయం లో గురువు గారు మన అందరి చేత ఆ మృతసంజీవిని ఎలా చదవాలో తెలియచేసారు.. అంత విలువైన మహ మంత్రం ను మనకోసం గురువు గారు మం అందరి చేత ప్రతి నిత్యమూ పారాయన గా చేయించారు
ఈ రోజుశ్రీ మద్ ఆంధ్ర భరతం లో గురువు గారు ఎన్నెన్నో తెలియని విశేషాలు తెలియచేసారు..చండీ సప్తశతి చేసుకునే వారికీ ఈ మృత సంజీవిని గురించి బాగా తెలుస్తుందని గురువు గారు తెలియచేసారు 
ఇక మనం కదా భాగం లోకి వెల్దాము 

దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడుని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవని ఎలాగైనా సాధించుకు రమ్మన్నారు. దాంతో సురలోకం వదిలి అసురలోకం చేరాడు.

            మృత సంజీవని విద్య అంటే చనిపోయే వాళ్ళని  తిరిగి బతికించే విద్య. అది ఒక్క శుక్రాచార్యునికే తెలుసు. అంచేత దేవతలకూ రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ఇవాళ చనిపోయారనుకున్న వాళ్ళు రేపటికి బతికి వచ్చే వాళ్ళు. తిరిగి తిరిగి యుద్ధం చేయడంతో దేవతలకు దిక్కుతోచలేదు. శుక్రునికన్నా నువ్వు శక్తి హీనుడవని బృహస్పతిని నిందించారు. స్వర్గం నుంచి తరిమివేసే పరిస్థితి వచ్చింది. ఆపద సమయంలో కొడుకుని శతృ శిబిరానికి పంపి ఆ విద్యను తీసుకు రావడమే విరుగుడని భావించాడు బృహస్పతి. శుక్రుని సేవించో ఆయన కూతురు దేవయానిని ప్రేమించో కార్యం సిద్ధించుకు రమ్మన్నారు.

            రాక్షస రాజ్యంలో కచుడు అడుగు పెట్టాడు. రాక్షసులు అడిగారు. బ్రాహ్మణుడనని చెప్పాడు.శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేయడానికి వచ్చినట్టు చెప్పాడు. ఇంటికి దారి చూపమన్నాడు. రాక్షసులు దారి తప్పించారు. అడవిలో తిరిగాడు. అలసిపోయాడు. చెట్టు నీడన నిద్రపోతే చెలికత్తెలతో వచ్చిన దేవయాని చూసింది. ముగ్దురాలైంది. కచుడు కళ్ళు తెరిచేసరికి చెలికత్తెలు మాయ మయ్యారు. దేవయాని మిగిలింది. శుక్రాచార్యుల ఇంటికి తోవ చూపమన్నాడు. కోరికను చెప్పాడు. దేవయాని తండ్రి వద్దకు తీసుకెళ్ళింది. చెప్పింది. కాదనలేక పోయాడు శక్రుడు. కచునిపని సులువు చేసింది దేవయాని. వలపు పెంచుకున్నది. కచుడు మాత్రం వచ్చిన లక్ష్యంమీదనే ఉన్నాడు.

            రాక్షసులకి అనుమానం తీరలేదు. ఇంటిపనీ, గురుసేవలూ చేస్తున్న కచుణ్ణి కనిపెట్టారు. చుట్టుముట్టి కత్తి దూసారు. అప్పటికి కచుడు ఆవుల్ని మేపుతున్నాడు. కత్తికోకండగా కచుణ్ణి చంపి నక్కలకు తోడేళ్ళకు ఆహారంగా వేసారు. కచుడు కనపడక దేవయాని తల్లడిల్లింది. తండ్రి చెప్పినా వినలేదు. ఒత్తిడి చేసి మృతుణ్ని సజీవుడిగా చేసింది. మృత సంజీవని మంత్రం పఠించి పిలిస్తే – లేచి వచ్చాడు కచుడు. రెండోసారి కచుణ్ణి చంపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని సముద్రంలో పడేసివచ్చారు. కచునికేదో ఆపద వచ్చిందని చెప్పి విలపించింది దేవయాని. తండ్రిని నిలదీసింది. శుక్రుడు మంత్రం చదివి కచుణ్ణి పిలవడంతో సముద్రంలోంచి నడుచుకుంటూ వచ్చేశాడు కచుడు. తమ ప్రయత్నం ఫలించని రాక్షసులు పట్టుదలగా మరో పథకం వేసారు. దేవతల గూఢాచారిగా కచుణ్ణి భావించి, చంపి కాల్చిబూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి గురువుగారి చేతే తాగించారు. కచుడు కనపడక నిద్రాహారాలు మానేసింది దేవయాని. శుక్రుడు తట్టుకోలేక సరే అన్నాడు. మృత సంజీవని విద్యతో కచున్ని పిలిచాడు. కడుపులోని బూడిద ఒక్క చోటకు చేరి రూపమయింది. జీవమూ వచ్చింది. అందుకే పిలిస్తే పలికాడు. పొట్టలోనే ఉండడం గ్రహించాడు. తాను బయటకు వస్తే నేను చనిపోతానన్నాడు తండ్రి. అలాగని పొట్టలోనే ఉంటే జీర్ణమైపోతాడు. ఏం పాలుపోలేదు. కచుణ్ణి పిలవమంది దేవయాని. పిలిచే ముందు మృత సంజీవని విద్యను అతనికి నేర్పమంది. పొట్ట చీల్చుకు వచ్చినా, చనిపోయిన మిమ్మల్ని బతికిస్తాడని నమ్మకంగా చెప్పింది. కూతురు ఆలోచన నచ్చింది. చెప్పినట్టుగానే పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్యను నేర్పించాడు. తర్వాత పిలిచాడు. శుక్రుని పొట్ట చీల్చుకు వచ్చాడు కచుడు. చనిపోయిన శుక్రుణ్ణి బతికించాడు.

            కచునికి వచ్చిన లక్ష్యం నెరవేరింది. వెళ్ళబోతే దేవయాని పెళ్ళాడమని కోరింది. గురు పుత్రికవు, సోదరితో సమానం అన్నాడు. మూడు సార్లు నాకు ప్రాణం పోసిన శుక్రుడు తండ్రి వంటివాడయితే, నువ్వు ఏమవుతావని తిరిగి ప్రశ్నించాడు. కాదన్నాడు. “నీవు నేర్చిన విద్య నీకు పనికి రాకుండా పోవుగాక!” అని దేవయాని శపించింది. “బ్రాహ్మణ కన్యవైనా నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక!” అని ప్రతిశాపమిచ్చాడు కచుడు. దేవయానిని మించిన అందగత్తెలు కచుని కళ్ళముందు కదలాడారన్న కథలూ ఉన్నాయి. మొత్తానికి తండ్రి అభీష్టాన్ని నెరవేర్చిన కొడుకుగా కచుడు మృత సంజీవని విద్యతో తిరిగి దేవలోకం చేరాడు! 
 ఇట్లు 
శివ పరివారం 

Saturday, September 4, 2021

navaratri ganapati

 నవ్‌రాత్రి, లేదా నవరాత్రి  అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని 

ఆరాధిస్తారు. మనకి గురువు గారు తరచూ చెబుతూ ఉంటారు  నవరాత్రి గురించి . అందులో భాగం గా మనకి ముఖ్యమైన నవరాత్రులు ఈ క్రింది విధం గా చేసుకుంటారు 

నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి, పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి : వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి : ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు : అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి : పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి : గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.

విజయదశమి ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు,