Wednesday, May 12, 2021

అక్షౌహిణి వివరణ

 


అక్షౌహిణి వివరణ

అక్షౌహిణి – సేనాసమూహవిశేషము

అక్షౌహిణి వరకు సంఖ్యావివరములు


1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే = ఒక పత్తి

పత్తి x 3 = సేనాముఖము (అంటే 3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు)

సేనాముఖము x 3 = గుల్మము (అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు)

గుల్మము x 3 = గణము (అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు)

గణము x 3 = వాహిని (అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు)

వాహిని x3 = పృతన (అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు)

పృతన x 3 = చమువు (అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు)

చమువు x 3 = అనీకిని (అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు)

అనీకిని x 10 = అక్షౌహిణి (అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు)


అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క

అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క

అక్షౌహిని X 18 = ఏకము

ఏకము X 8 = కోటి ( ఈ కోటి మన కోటి కాదు )

కోటి X 8 = శంఖము

శంఖము X 8 = కుముదము

కుముదము X 8 = X 8 = పద్మము

పద్మము X 8 = నాడి

నాడి X 8 = సముద్రము

సముద్రము X 8 = వెల్లువ

అంటే = 36691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.


ఇలాంటి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది.


అంటే 366917139200 X 70 = 2,5684239,97,44,000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.వీరికి నీలుడు అధిపతి

ఖాండవ దహనం



చాలా ఏళ్ళ క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. వందేళ్ళపాటూ సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది. సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. " ఖాండవ వనంలో అనేక దివ్య ఓషధులు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో అ వనాన్ని దహించి ఆ ఓషధుల్ని స్వాహాచేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. శత్రు సంహారమూ జరుగుతుంది" అని అగ్నికి సలహ ఇచ్చాడు.సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడ్ని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు.అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కణకణలాడిన అగ్నిదేవుడు ఆ వనన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులూ కాపు కాసాడు. ఏడు రోజులూ ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్లి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు."నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది. అప్పటి వరకూ వేచివుండు" అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు.పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని ఖాండవ వనానికి వెళ్ళాడు.యమునా తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేనన్నాకా అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్ధన మేరకు అర్జునుడికి 'చంద్రధనస్సు ' (గాండీవం) ఇచ్చాడు. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూణీరం ఉన్నది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడు కపిరాజుచిత్తరువుతో వున్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్యరథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగుర్రాలు పూంచి ఉన్నాయి. నాలుగిటికీ కళ్ళేలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు.కృష్ణార్జునులు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలాకాస్తూ, వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. అడవిలో జంతువులు అటూ , ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అక్కాడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములూ, మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేరా ఒక్క వానచినుకు రాలకుండా శరచత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు.ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆసాంతం గుటుక్కున మింగి ఖాండవ వనానికి దూరంగా ఉమ్మి వేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి ధుళి పోవడం వల్ల అర్జునుడి గురితప్పింది. అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి.అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు. పాండవమధ్యముడు ఖాండవ వనంలో కనిపించిన ప్రతీ ప్రాణినీ నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు.బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు ముక్కలు చేస్తున్నాడు. మరో పక్క కృష్ణుడు అసురుల్ని మట్టికరిపించాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్జ్వలంగా ప్రకాశించాడు.


ఇట్లు 
శివ పరివారం 


Tuesday, May 4, 2021

తెలుసుకోవలసినవి

ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*
 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 *వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు*

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 
మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 
సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 
యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 
కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?*

 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 *తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?*

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 *శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?*

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 *నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?*

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

  *ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?*

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .
 2. స్మశాన భూమికి సమీపం లొను .
 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .
 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .
 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .
 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 
 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
  
 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?*

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 *గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?*

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?*

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.
 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 *సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?*

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 *శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?*

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 *పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు* 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 *శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?*

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *శౌచమంటే ఏమిటి ?*

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 
 1. బాహ్య శౌచం.
 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?*

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 6. మాత్స్చార్యము .
 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసూయ
 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 *భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?*

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?*

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?*

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.
 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.
 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 
 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 
 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.
 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .
 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చే

Toయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .
 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.

Monday, May 3, 2021

దశమ స్కంధం - పూర్వ భాగం

 



ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

పరమేశ్వర సంకల్పం తో మనం నిత్యం జరిగే శ్రీ మద్ భాగవతము గంగా ప్రవాహం వలె గత సం నుంచి మన పూజ్య గురువుగా గారు ఒక యాగ్యం చేసినట్టు శ్రీ మద్ భాగవతం ను మనకు మన శివ  లోక కల్యాణార్థం సంకల్పించి మనకు ప్రవచన రూపం లో తెలియాని ఎన్నో విశేషాలు ను మనకి అర్ధమయ్యిలే భాషల్లో తెలియచేసారు.. ఎంతైనా మన గురువు గారు అధ్యాపన వృత్తి లో ఉన్నారు , పిల్లలకి ఎలా చెపితే అర్ధం అవుతుందో అదే విధం గా మా అందరికీ తెలియయచేసారు 

శ్రీకృష్ణ సౌందర్యాన్ని సహృదయ హృదయంగమంగా సంస్కృతంలో మహా కవులు వర్ణించారు. శుభాకృతులైన ఆ కృతులలో జయదేవుని “గీత గోవిందం”. లీలాశుకుడు “శ్రీకృష్ణ కర్ణామృతం”, నారాయణ తీర్థులవారి “శ్రీకృష్ణ లీలాతరంగిణి” ప్రధానంగా చెప్పుకోదగ్గవి. ఇక తెలుగులో శ్రీ కృష్ణుని లీలావిలాసాలను ఎఱ్ఱన మహాకవి తన హరివంశంలో సుమనో మజ్జంగా చిత్రించాడు. తరువాత బమ్మెర పోతన్నగారి భాగవత దశమస్కంధం కృష్ణావతార వైభవాన్ని అత్యంత హృదయంగమంగా, అద్వితీయంగా, అనన్య సామాన్యంగా అభివర్ణించింది. ఒక విధంగా చెప్పాలంటే దశమ స్కంధం “మహానందాంగనా డింభకుని లీలా సర్వస్వమని భావించవచ్చు. దేవకీ గర్భస్థుడైన భగవంతుని బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తాడు.అటువంటి పోతనామాత్యులు శ్రీ మద్ భాగవతం ను మన గురువు గారు యధాతదం  గా మనకి కళ్ళకి కట్టించినట్టు , ఒక వైపు దృశ్య కావ్యం గా కూడా మనకి చూపించే ప్రయత్నం చేసారు 

ఇంకో విశేషం ఏమిటంటే మనకి దశమ స్కంధం తో పాటు లీలాశుకుడు “శ్రీకృష్ణ కర్ణామృతం”, ను సవివరం గా మనకి తెలియాచేసారు 


కొన్ని ముఖ్యమైన శ్లోకాలు తో ఈ దశమ స్కంధం విశేషాలు ను అందించే ప్రయత్నం చేస్తాను 


ఏమి నోము ఫలమొ ఇంత ప్రాద్దోక వార్త, వింటి మబలలార! వీను లలర మన యశోద చిన్ని మగవానిఁ గనె వంట; చూచి వత్తమమ్మ! సుదతులారా

అనుకుంటూ యశోద ఇంటికి వస్తున్న ప్రజకాంతల ఉత్కంఠను పోతన్నగారు ఈ విధంగా వివరించారు.

వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల

ల్లాడఁ గపోల పాలికల హాటక పత్రరుచుల్ వినోదనం

బాడఁ, బటాంచలంబు లసియాడఁగఁ జేరి యశోదయింటికిం

జేడి లేఁగి చూచి రాగి, జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్.

అలా వచ్చిన గోపాంగనలు తెచ్చిన కానుక లిచ్చి, చిన్ని పాపనికి తల అంటి, పసుపు పూసి, స్నానం చేయించారట. నీళ్లు చుట్టు తిప్పి, రక్ష పెట్టి, తొట్టెలో ఉంచి జోలపాడారట

జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా

జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్

గొల్ల యిల్లాండ్రు అలా జోల పాడుతూ ఊపుతూ ఉంటే దొంగ నిద్దుర పోతున్న బాలకృష్ణుణ్ణి,పోతన్నగారు ఈ విధంగా వివరించారు.

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు శ్రీకృష్ణ కథామృత మైన దశమస్కంధం చాల చాల ఉత్కృష్ణమైనది , అందులో   శైశవలీలలు, వెన్నదొంగ ముచ్చట్లు, చల్దులు గుడుచుట, పూతన సంహారాలు, కాళియ మర్థనం, గోవర్థన గిరి ధారణ, రాసక్రీడావర్ణన, రుక్మిణీకల్యాణం మున్నగు ఈ స్కంధభాగం పూర్వభాగం లోని ఘట్టాలు అన్ని సుధలు స్రవించే, చెవులూరించే, భక్తిముక్తి ప్రయుక్తాలే, బహుళార్థ సాధకాలే, బహుశాస్త్ర సంశోభితాలే. పద్యాల అమృతగుళికల అబ్బో ఎన్నెన్నో.వరించడం కన్నా ఆ అమృతం ను ఆస్వాదిస్తేనే చాల బాగుంటుంది 

ఓ యమ్మ! నీ కుమారుఁడు

మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!

పోయెద మెక్కడి కైనను

మా యన్నల సురభులాన మంజులవాణీ!

నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని

న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!

ఇలా ఎన్నని ఇక్కడ ఎంచగలం. ఇలాంటి పద్యాల ప్రసాదం పంచిన పోతన మహానుభావులకు సాష్టాంగ ప్రణామాలు ఈ రామ కృష్ణులు ద్వారా మనకి ఆ పరమేశ్వర శ్రీ మధ్ భగవతం వినే భాగ్యం కలిగినది 

ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది. తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. శ్రీ పోతనామాత్యులు ను మించిన వారు లేరు, రారు! 

 
ఇట్లు 
శివ పరివారం 

Thursday, March 18, 2021

షష్ఠ్యంతములు





హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం

హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో

హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా

హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

భావము:

మనోహర హారాలు ధరించువాడికిం; నంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.


శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని

ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా

పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం

చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

భావము:

శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి.


క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా

రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ

హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ

మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.


భావము:

క్షమాగుణశీలికి; కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని పార్థుని నడిపించినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన

స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం

ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని

ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.


భావము:

న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.



Tuesday, March 16, 2021

గోపికా వస్త్రాపహరణ - శ్రీ కృష్ణ లీలామృతం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ లీలామృతం 

మనకి నిత్యం గంగా ప్రవాహం లా జరిగే శ్రీ మద్ భాగవతం లో ఇప్పుడు గోపికా వస్త్రాపహరణ ఘట్టం లో ఉన్నాము . అసలు శ్రీమద్భాగవతం లో  శ్రీకృష్ణలీలా రసామృతం. లీలలన్నీ అభౌతికాలు, అధ్యాత్మ రహస్యగర్భితాలు ,  జీవత్వాన్ని తొలగించి చిన్మయత్వాన్ని ప్రసాదిస్తాయి.

అని గురువు గారు తెలియచేసారు. పరమార్థంలో- గోపికల 'అనాది అజ్ఞాన ఆవరణ'మనే అంబరాలను (చీరలను) అపహరించాడు. మనం కృష్ణ  తత్వాన్ని గ్రహించాలి 

నేను ఒక మంచి పద్యం ను అందించే ప్రయత్నం చేస్తాను 

మామా వలువలు ముట్టకు

మామా ! కొనిపోకుపోకు మన్నింపు తగన్

మామాన మేల కొనియెదు?

మామానసహరణ మేల? మానుము కృష్ణా!


నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.


          గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.

మామా = మావి మావి, మా అందరి; వలువలు = వస్త్రములు; ముట్టకు = తాక వద్దు; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుకొని; పోకు = పోబోకుము; మన్నింపు = మా మాట విను; తగన్ = చక్కగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.

ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. 

అదే ఈ రోజు గురువు గారు మన శ్రీమద్ భాగవతం లో ప్రస్తావించారు 

ఇట్లు 

శివ పరివారం

Monday, March 8, 2021

కాళీయ మర్దనం

DATE : 08-03-21 


ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి నిత్యం జరిగే శ్రీ మద్భాగవతం ఇప్పుడు కాళీయ మర్దనం ఘట్టం లోకి వచ్చేసింది..

శ్రీ కృష్ణుడు లీలలు ఒక్కో ఘట్టం వింటుంటే ఎంతో ఆనందం గా ఉంది.. 

గురువు గారు ఫోన్ చేసి ఈ రోజు మీ అమ్మాయి కృష్ణ మానస చే స్వామి వారికీ నివేదన ఇప్పిచాలి అనుకున్నాను.. శ్రీ కృష్ణడు కాళీయ మర్దనం నటరాజ దృశ్యం. ఉంది.. అమ్మాయి చే ఒక పాటకి నృత్యం చేయించు అన్నారు..

మా అమ్మాయి అనుకున్న పాట వేరు అప్పటికప్పుడు స్వామి వారి ఆశీస్సులు తో ఇంకో పాట పెట్టాను.. సందర్భానుసారం గా స్వామి వారికీ తన నృత్యం తో శ్రీ కృష్ణుడి లీలల తో నృత్య ప్రదర్శన ఇచ్చింది.. తన సమయస్ఫూర్తి తో చేసినందుకు శ్రీ రామ రక్షా 


కాళీయ మర్ధనం యెవరు చేసారో గుర్తుంది కదా?, ఔను కృష్ణుడే చేసాడు! ఎందుకు చేసాడంటే… అసలు కాళీయుడెవరో అతని కథేమిటో తెలుసుకుందామా ..


కాళింది మడుగున వున్న విషసర్పం పేరే కాళీయుడు! కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్ళన్నీ విషతుల్యమయ్యాయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు చనిపోయారు. ఆ నీటిలో వున్న చేపలూ తాబేళ్ళూ వంటి జీవరాసులెన్నో చనిపోయాయి. కాళింది మడుగులోకి దిగాలంటేనే జనం భయపడిపోయారు. కాళింది మడుగునే కాళీయుడున్నాడు. దాక్కున్నాడు!


కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.


కాళీయుడు కాళింది మడుగున దాక్కోవడం వెనుక కథ ఉంది. కద్రువ కడుపున పుట్టిన కాళీయుడు మొదట రమణక ద్వీపంలోనే ఉండేవాడు. అక్కడున్న పాముల్ని చూసి జనం భయపడిపోయారు. వాటికి కావలసిన ఆహారం ఇస్తే తమ జోలికి రావని భావించారు. అందుకే ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకొచ్చి చెట్ల మొదళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవారు. దాంతో పాములు జనం మీదకి వెళ్ళేవికావు. కాని పాముల్ని చూసి జనం భయపడినట్టే – గరుడుని చూసి పాములూ భయపడేవి. అందుకే తమకి జనం పెట్టిన ఆహారంలో కొంత భాగం తీసి గరుడుడికి ఇచ్చేవి. దాంతో గరుడుడు పాములజోలికి వెళ్ళేవాడు కాదు. అయితే కాళీయుడు గరుడుడికి కేటాయించి పెట్టిన ఆహారాన్ని వదలకుండా తనే తినేవాడు. ఈ సంగతి గరుడుడికి తెలిసింది. కోపం వచ్చింది. కక్ష పెరిగింది. కాళీయుడు కోసం గరుత్మంతుడు వెదికాడు. వెంటాడి వేటాడ బోయాడు. కాళీయుడు భయపడ్డాడు. పారిపోయి వచ్చి కాళింది మడుగున స్థిరపడ్డాడు. *గరుత్మంతునికి తెలిసినా కాళీయుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే గరుత్మంతుడు కాళింది మడుగుకి వచ్చాడా చచ్చాడే*! అలాంటి శాపముంది. ఆ శాపం కాళీయుడికి తెలిసింది. గరుత్మంతుడు తననేమీ చేయలేడని మరింత గర్వపడ్డాడు కాళీయుడు!


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు.


కాళింది మడుగు ఉన్నా దాంట్లోకి పెద్దలు దిగనివ్వక పోవడం, జరిగిన నష్టం యెరిగి కృష్ణుడు ఊరుకోలేదు. మడుగు పక్కనే వున్న చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుకొమ్మలు మడుగులో తమ నీడ చూసుకుంటుంటే – కొమ్మ మీదుగా వచ్చిన కృష్ణుడు కాళీయుని జాడ చూసుకున్నాడు. మిత్రులు వారించినా వినలేదు. అద్దంలా మెరిసే నీళ్ళలో కాళీయుడు పడగ విప్పి కనిపిస్తూ ఉండడంతో అదే అదనుగా పడగమీదకు దూకాడు కృష్ణుడు. పడగ మీద పాదం మోపి తాండవం చేసాడు. కాళీయుడు కృష్ణుణి భారాన్నీ అవమాన భారాన్నీ మోయలేకపోయాడు. నీటిపైకి శిరస్సు యెత్తి ముంచి యెంతో ప్రయత్నించాడు. కృష్ణుడు కాళీయ మర్దనం అంటే కాళీయుని పడగని పొగరుని నలగ్గొట్టాడు. అతిబల గర్వాన్ని, అహంకారాన్ని అణచేసాడు. శిరసు చితికిపోయేంతగా తొక్కాడు కృష్ణుడు.


దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు

కాళీయుని భార్యలైన నాగకన్యలు వచ్చారు. తమ భర్తని విడిచిపెట్టమని వేడుకున్నారు. కృష్ణుడు చంపకుండా కాళీయుణ్ణి వదిలాడు. గరుత్మంతునితో చావులేకుండా అభయమిచ్చాడు. పాతాళలోకానికి పొమ్మన్నాడు. తిరిగి తాను నివసించిన రమణక ద్వీపానికి కృష్ణుని అనుమతితో భార్యల్ని తీసుకుని కాళీయుడు వెళ్ళిపోయాడు!

కృష్ణుని కాళీయ మర్ధనం వల్ల అటు కాళీయునికీ ఇటు కాళిందిని రక్షించి జనానికి మేలు జరిగింది!.

అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది. ఇలా కాళీయమర్దనం స్మరించుకుంటే అనేక గ్రహదోషాలు పోతాయి.

ఇట్లు 

శివ పరివారం 

మా నామ గీత అమృతం లో కూడా ఒక పద్యం ఉంది 

వందేకాళియ గర్వనాశన కరం వందే జగజ్జీవనం వందే యాదవకాంతవస్త్ర హరణం వందేత్రిమూర్త్యాత్మకం వందే నారద శంకరాది వినుతం వందే రమావల్లభం వందే కౌస్తుభ రత్న భూషణధరం వందే సుభక్తప్రియమ్.