Thursday, February 5, 2026

ఇద్దరు చక్రవర్తులు సాహిత్య సామ్రాజ్యానికి అవధాన శివకేశవులు.

*జయహో జయహో! బహు* *పరాక్ బహు పరాక్!*
*సంగీత–సాహిత్య సామ్రాజ్య*  జంట *చక్రవర్తులారా!*
సాహితీ సౌరభమై సర్వదిక్కుల నిండగా।
అవధాన యజ్ఞంలో అగ్నిజ్వాలలవంటి
ప్రతిభా ప్రతాపాలతో ప్రభవించిన జంట ॥

భువన విజయం ఆస్థానమున
భావ–రాగ–తాళాల సింహాసనాధిపతులై,
కాలానికే కవిత్వం నేర్పిన కీర్తిశాలులు,
కళలకు కిరీటమై నిలిచిన మహామాన్యులు ॥

జ్ఞానమునకు గౌరవం, గానమునకు గంభీరత,
సాహిత్యమునకు శాసనం మీరు ప్రతిరూపాలు।
యుగయుగాల వరకూ యశస్సు నిలిచిపోవు
జంట అవధాన దివ్యదీపాలు మీరే కదా ॥

సంగీత సాహిత్య సరస్వతీ కృపాకటాక్ష  సింహాసనాధీశు చక్రవర్తులు  ।
అవధాన సామ్రాజ్యాధిరాజులై భువనవిజయాస్థాన భూషణులు ।
జంట చక్రవర్తులిద్దరికి జయహో జయహో బహు పరాక్ ॥
ఈ సందర్భం  గా మీకు  *అవధాన శివకేశవులు*  గా బిరుదాంకితులై శశ్వతముగా  మీ పేరు ప్రఖ్యాతలు గావించాలని మా కాంక్ష అభిలాష

Wednesday, January 21, 2026

విశ్వదాభిరామా వినురావేమా యోగి వేమన.

విశ్వదాభిరామా వినురావేమా యోగి వేమన.

చాలా మందికి వేమన గురించి
సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.
కానీ వాస్తవం వేరు.
ఈయన అసలు పేరు " బెదమ కోమటి చిన వేమారెడ్డి "
ఈయన అన్న పేరు "బెదమ కోమటి పెద వేమారెడ్డి".
అప్పటి 'కడప, కర్నూలు & అనంతపురం' కలిపి ఒకే రాజ్యంగా ఉండేవి
దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.
అతని మంత్రి "తురగారాముడు".
తురగారాముడు ఎలాగైనా అన్న-దమ్ములిద్దరినీ చంపి
తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు.
ఇప్పుడు మనం చినవేమారెడ్డి ని _వేమన_ అని పిలిచుకుంటున్నాము
ఇతడు మహా ధైర్యవంతుడు.
పేరుకే   అన్నగారు రాజు.
కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు - కనుసన్నులలో ఉంటుంది
అతని ధైర్యానికి ఉదాహరణ.
ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ
హడలెత్తిస్తూ ఉంటుంది.
అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు.
ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం  ఏ పహిల్వాన్ చేత కూడా కాదు
అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది
అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి   ""ఏయ్"'  అని గద్ధిస్తాడు.
ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.
దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు హడలెత్తి తోకముడుచుకొని పారిపోతుంది
దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు
వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,
వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు.
తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు

వేమనకు భోగగత్తెల ( వేశ్యల ) సాంగత్య కాంక్ష ఎక్కువ
ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే
ఈయనే  ముందు వెళ్ళేవాడు
వేమనకు " విశ్వద " అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది.
వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం
ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది
కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు!!
మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు
కానీ అది శాశ్వతమ్ కాదు 
అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది.
యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో
తన ప్రాభవం కోల్పోతుంది .
"ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు
మీరు పరిగెడుతున్నారు
మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది"
కానీ వేమన పట్టించుకునే వాడు కాదు
తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది.కానీ ఫలితం ఉండదు
అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి
వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది
ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు""  భోగమాటను ప్రారంభిస్తుంది
ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది.
వేమన ఒక సారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.
ఆమె అందానికి దాసుడై పోతాడు
ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు
ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.
నెలలు గడుస్తాయి.
నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది
వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు
డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపొయ్యడం మంచిది కాదని,,,
రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని
రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది 

" విశ్వద " కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది
అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి.
సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి
తొందరలోనే మీరు మరణించబోతున్నారు.
శరీరానికి నెలలు కాదు. రోజులు మాత్రమే ఉన్నాయి.
ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించ లేరు.
ఇప్పటికైనా మేల్కొనండి
జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి.
ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది.
వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన
తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు
కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు.
సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు
దానికి గానూ ఆమెకు డబ్బు,,,
జాగీరు ఎరగా చూపుతాడు
చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని బెదిరిస్తాడు
చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది
ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది
వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు
అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు
నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది.
తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు
ఆ అడవులలో _అభిరామ_  అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు
ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు
అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన వైద్యం తో బ్రతికిస్తాడు
మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు
మౌనంగా కూర్చునేవాడు.
ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు.
మహా మౌనంగా ఉండేవాడు.
తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు
విశ్వద చెప్పిన సత్యం   _నాగులు , తురగారాముడు_ చేసిన మోసం కళ్ళముందు కదిలేవి
తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు
ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు
అభిరాముడు తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని
కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు
ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,
తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని
రేపు రావలసిందిగా చెబుతాడు.
అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు.
దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు
దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు
అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో వేమన బయలుదేరుతాడు
వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.
విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,
రావలసిన వాడు రానే వచ్చాడు ,,
అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,,
మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు
ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది
అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు
తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోనాకిష్టమై.
వేమన దానికి అభిరామాదుఃఖిించకు ,,భాధ పడకు,,,
నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ
నేను పెడచెవిన పెట్టాను
ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది.
విస్వద.అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే
వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను
అని చెబుతాడు.
విస్వద అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా.
అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా
ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు .
అందుకే 
విశ్వదాభిరామా  వినురావేమా

Sunday, November 23, 2025

నా డైరీ లో ఈ రోజు.. ఆ రోజు 21st , 22nd నవంబర్ ,

 నా డైరీ లో ఈ రోజు.. 

ఆ రోజు 21st నవంబర్ , ఈ రోజు ప్రయాణం కోసం చాల రోజులు క్రితం రిజర్వేషన్ చేసుకున్నాను , ఎందుకంటే మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం 22 నవంబర్ శుక్రవారం నాడు.. మా బాస్ ని అడిగి సెలవు తీసుకున్నాను.. వర్క్ ని వారం రోజులు ముందు నుంచి ముగించుకుని వచ్చాను.. సో గురువారం మధ్యాహ్నం భోజనం చెస్ సాయంత్రం 6 ki ట్రైన్ అయితే బెంగళూరు లో 3 గంటలు ముందు బయలుదేరాలి . ట్రాఫిక్ ని మనం అంచనా వెయ్యలేము.. జస్ట్ నేను వెళ్లే టైం కి ట్రైన్ వచ్చేసింది.. 5 ని లో కదులుతుంది అంటే ట్రైన్ ఎక్కాను.. అదో పెద్ద challange ఇక్కడ.. సరే శుక్రవారం ఉదయం కి చేరుకున్నాను.  

ఎందుకంటే శుక్రవారం చాల tight షెడ్యూల్ పెట్టుకున్నాను  .  ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది. మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం ఉంది.. ఇంకా ఊర్లో చాల పనులు పెట్టుకున్నాను.. దానికి తోడు నాకు బండి లేదు.. అన్నిటికి ఆటో లేదా బైక్ బుక్ చేసుకుని వెళ్ళాలి.. 

ఇక ఇంటర్వ్యూ కి రెడీ అయ్యి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ కి వెళ్ళాను.. HR తో ఫైనల్ రౌండ్ అని.. అక్కడికి వెళ్ళాక వాళ్ళు HR అండ్ HOD ఫైనాన్ల్ రౌండ్ ని పోస్టుపోన్ చేసారు.. చాల కోపం వచ్చింది.. ఎందుకంటే అంత రెడీ చేసుకుని , సమయం వెచ్చించి , సిద్ధం గా ఉంటె ఇలా ప్రోగ్రాం డిలే అయితే ఎవరికైనా కోపం వస్తుంది. 

అసలే నేను టైం ని calculate చేసుకునే వాడిని. ఇక మధ్యాహ్నం కి ఇంటికి రావడం అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం కి రెడీ అవుతున్నాను..ఇంట్లో పరిస్థితి తెలుసు కదా ఎక్కడివి అక్కడే వస్తువులు పడేస్తాము.. చేసే వాళ్ళు ఉండరు.. మనది మనమే చేసుకోవాలి.. శ్రీ లతా కూడా అప్పుడే వచ్చింది. ఈ మధ్య పిల్లలు కూడా మన మాట వినే స్టేజి దాటిపోతున్నారు.. మొబైల్ కూడా వాళ్ళని వాళ్ళ చదువుని , సంస్కారాన్నై అన్నీ దూరం చేస్తున్నాయి.. మనం పని చెప్పినా ఓఓఓ ,ఉఉఉఉ అంటారు కానీ చెయ్యరు.. వినరు.. 

సరే ఇంతకీ నాకు ఫొటోస్ , పిచ్చి.. మా అమ్మాయికి మంచి ఫొటోస్ తీయాలని ఎప్పటినుంచో అడుగుతోంది.. సరే అని మొహమాటం తో రంజాన ని కెమెరా అడిగాను.. అది కూడా మా శ్రీలత వద్దు అని చెప్పింది.. ఏమి ఫరవాలేదు లే.. రంజన ఇస్తుంది అని చెప్పను. తాను చెప్పింది ఛార్జింగ్ పెట్టుకోవాలి అని , కానీ నేను సరే అని ఊరుకున్నాను.. ఇంటికి రాగానే సూర్య కి చెప్పి కెమెరా లో బాటరీ ని ఛార్జింగ్ పెట్టు అని చెప్పి వేరే పనికి వెళ్ళాను.. సరే వాడు ఛార్జ్ పెట్టాడు. స్విచ్ కొంత సేపు అయ్యాక ఎదో ఆలోచిస్తూ ఆఫ్ చేసాడు.. ( స్పైక్ బార్ ) .. నా దగ్గర ఒక మెమరీ కార్డు ఉంది.. ఒక్కసారి బ్యాక్ అప్ తెయ్యరా అని చెప్పను.. ఊ అని చెయ్యలేదు.. 

అదే రోజు నేను చాల టెన్షన్ లో హడావిడి లో మొబైల్ ని రెండు మూడు సార్లు  మర్చిపోయాను.. దానికీ వాడు విసుకున్ని తెచ్చాడు. 

ఇక అసలు స్టోరీ మొదలైంది.. మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.. ఫొటోస్ తీద్దాం అని స్టార్ట్ చేశాను.. 3 ఫొటోస్ తీసాను.. బాటరీ ఛార్జింగ్ అయ్యిపోయింది. చూసాను మా సూర్య ఇంకో బాటరీ ఛార్జింగ్ పెట్టి  adaptor ని ఇంట్లో స్విచ్ కి ఉంచేసాడు.. సరే ఇంకో బాటరీ తో కొంత తీసాను.. మెమరీ కార్డు నా కార్డు వేసి ఫొటోస్ తీసాను.. ఫుల్ అని వచ్చింది.. సరే రంజన మెమరీ కార్డు లో తెయ్యచ్చు అని చూసాను.. అనుకోకుండా వీడియో తీసాను.. చీకటి , జనాలు ఫుల్ struck అయ్యింది.. వీడియో డిలీట్ చేద్దాం లే ప్లేస్ కలిసి వస్తుంది అనుకున్నాను . ఆ డిలీట్ చెయ్యడం లో ఫార్మటు చేశాను.. అప్పటికి నా bp హై అయిపొయింది.. చీకటి..  సరే కొన్ని ఫొటోస్ తీద్దాం అని చూసే సరికి బాటరీ నిల్. ఈ హడావిడి లో ఒక మెమరీ కార్డు నా చేతిలోంచి జారిపోయింది.. చీకట్లో కనబడలేదు. ప్రోగ్రాం అంత అయ్యేక రాత్రి 11 వరకు వెతికాను.. చివరికి నాకు మా ఆవిడకి గొడవ.. మా బావ వచ్చి సర్ది చెప్పి ఇద్దరినీ కార్ లో తీసుకుని రావడం జరిగింది . 

సారాంశం ఏమిటంటే 

సో మొత్తానికి మనం ఏదైతే ఆరాట పడతామో  , అతిగా చేద్దాం అనుకుంటామో , ఇష్ట పడతామో అది మన చేతికి రాదు.. చేయలేము.. ఈశ్వర సంకల్పం ఉండాలి.. అదృష్టం ఉండాలి. మొత్తానికి మా అమ్మాయికి నా మొబైల్ లో తీసిన కొన్ని ఫొటోస్ మాత్రమే వచ్చాయి.. ఇంచుమించు నెల రోజులు నుంచి ప్లాన్ చేసుకుంటే చివరికి ఇలా జరిగింది.. నేను ఎప్పుడు బాధపడలేదు.. కానీ మెమరీ కార్ మిస్ అయింది. మా రవి రంజన ఏమంటారో అని భయపడుతూ భగవంతుడు కి క్షమాపణ చెప్పుకున్నాను.. నాకు ఏది జరిగినా నా డైరీ లో రాసుకోవడం నా అలవాటు.. రేపు అన్నరోజున ఏమి జరిగిందో తెలుసుకోవాలి కదా..

Tuesday, January 31, 2023

బీష్మ ఏకాదశి

కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.

కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.

భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.

***********************************************

భీష్మ ఏకాదశి
||ॐ||ఓం నమోనారాయణాయ || ॐ ||

ॐ అంపశయ్యపై శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనముతెలియపరచాలని, అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికితెలియపరచాలని భావించాడు.

ॐ భీష్మునిలోనిభగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన నెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహం తోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజు కు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో… వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో

ॐ “కిమేకిం దైవతం లోకే” అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?

ॐ “కింవా ప్యేకం పరాయణం”- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?

ॐ స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన

ॐ కం అర్చయంతః – ఎవరిని అర్చించడం/ పూజించడం వలన

ॐ ప్రాప్యుః మానవః శుభం – మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.

ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః – అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?

ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?

అని అడుగుతాడు.

ॐ జగత్ ప్రభుం – ఈ జగత్తుకు ప్రభువైన వాడు

ॐ దేవదేవం – దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు

ॐ అనంతం – అంతం అంటూ లేని వాడు, అంతటావ్యాపించి ఉన్నవాడు

ॐ పురుషోత్తమం అందరిలో కెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు

ॐ స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః – ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో ………….

అంటూ మొదలుపెట్టి “విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః……” అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను (1000 నామాలను) ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.

ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.

ॐ ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు

“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||”

ఈ పైశ్లోకం చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానం!! ఇది పార్వతీ దేవికి పరమ శివుడు వివరించాడు!!

Sunday, August 14, 2022

అష్టాదశపురాణాల్లో

 వ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాల్లో.. ఏ పురాణంలో ఏముందంటే..

మత్స్యపురాణం
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏంటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
కూర్మపురాణం
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
వామన పురాణం
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించిన వర్ణన ఉంటుంది. 
వరాహపురాణం
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
గరుడ పురాణం
గరుడుడి వివిధ సందేహాలపై విష్ణుమూర్తి చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు,  ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి. 
వాయుపురాణం
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి.
అగ్నిపురాణం
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.
స్కాందపురాణం
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి ఇందులో ఉంటుంది. 
కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
లింగపురాణం
లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటూ ఖగోళ, జ్యోతిష్యం గురించి ఉంటుంది.
నారద పురాణం
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది. 
పద్మపురాణం
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
విష్ణుపురాణం
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది.
ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
మార్కండేయ పురాణం
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
బ్రహ్మపురాణం 
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాసమహర్షి.  
భాగవత పురాణం
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శకమహర్షి చెప్పాడు. శుకుడికి మొదట వ్యాసుడు బోధించాడు. 
బ్రహ్మాండ పురాణం
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. 
భవిష్య పురాణం
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.
బ్రహ్మాపవైవర్తపురాణం
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి
ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

https://archive.org/stream/in.ernet.dli.2015.492513/2015.492513.ashhtaadasha-puraand-akathaa_djvu.txt

Saturday, August 13, 2022

MY NOTES...

 

వృద్ధాప్యం అనివార్యంగా అవస్థతో కూడుకుని ఉంటుంది . మన జీవన ప్రవాహంలో వయసంతా కొట్టుకుపోయాక  మిగిలిన కొసరులో  అంతా మిగిలినది వృద్దాప్యమే . 
ఆ వృద్ధాప్యం అంటా అనుభవాల గనులే గ్యాపకాల దొంతరలే .. 
వృద్ధులంతా నిన్నటి బాలలే. నేటి బాలలంతా రేపటి  వృద్దులే.  వయసుకు  ఎవ్వరూ అతీతులు కాదు. ఈ విషయం ప్రతి మనిషికి  తెలుసు కానీ  ముందుకు వెళ్లి పోతున్నాం అని తెలిసి కూడా  మనిషి  స్వార్థంతోనే జీవిస్తాడు. మరణం  ఉందని  తెలిసి కూడా  ఆశల కొక్కానికి వేలాడ బడుతుంటాడు. ఇక్కడ మనిషి  నైజం  విచిత్రంగా అనిపించినా ..జీవితం అంటే అదే !
జీవితం లో జీ(వి)తం కూడా ఉంటుంది కదా.. దాని కోసమే తాపత్రయం 
మనిషి మారడు. జీవితం కూడా  మారదు. అదే బాల్యం... అదే యవ్వనం... అదే ప్రౌడత్వం... అదే ముసలితనం... ఆ తర్వాత అంతా శూన్యం!
జీవిత ప్రయాణంలో ఎవ్వరి గమ్యం ఎంతవరకో  ఎవ్వరికి తెలియదు. కాగా ఇక్కడ జీవితం చివరి  అంకం వరకు  గమ్యం సాగించిన వాళ్ళను మనం  అదృష్ట వంతులుగా భావిస్తుంటాం. అంత జీవితం మనకు  కూడా  కలగాలని వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాం. 

Tuesday, May 17, 2022

నారద మహా ముని జయంతి

 ఈ రోజు నారద మహా ముని జయంతి అని గుర్తు చేసినందుకు ధన్యవాదములు అందరికీ తెలిసినదే..కానీ తక్కువ మందికి ఆ మహా ముని గురించి తెలుసుకుంటారు..

మనకి శ్రీ మద ఆంధ్ర మహా భారతం లోను మరియు భాగవతం లో నారదోపాఖ్యానం ఉంటుంది.. 

మన దౌర్భాగ్యం ఏమిటంటే మన సినిమాలలో నారదులు వారి ని ఒక కలహ ప్రియుడు గా అభివర్ణించారు 

మా పూజ్య గురువు గారు శ్రీ మద్ భాగవతం లో నారదులు వారి చరిత్ర అయన గురించి ఎంతగానో వర్ణించారు.. 

నారదుడు కలహప్రియుడా? నారద మహర్షి మనందరికీ సుపరిచితుడు. అన్ని పురాణాల్లోనూ, కథల్లోనూ మనకు కనిపిస్తాడు. అంతేకాదు దేవ సంగీతకారుడు. నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలిపేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయనో ఆదర్శ పాత్రికేయుడు. నిరంతరం ధర్మరక్షణ కోసం తపించే హరిభక్తుడు మంచికి చెడులకు జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే.

నారద మహర్షి ఎంతో మంది సాత్విటీలకు ఆయన మోక్షమార్గాన్ని చూపించారు. ధర్మానికి, ఆధర్మానికి మధ్య జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషించేవాడు. అయితే కొంతమంది. మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను కలహభోజనుడు'గా, 'కలహప్రియుడు"గా అభివర్ణించారు.

ఈ లోకం తీరే అంత... నిజం మాట్లాడేవారికి ఎప్పుడు కష్టాలే అందుకే అన్నారేమో యదార్థవాది లోకవిరోధి. ఈ లోకంలోను, పురాణ కథల్లోను ధర్మ పరాయణులకు ఎప్పుడు కష్టాల్లో ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవారంటే అదో చిన్న చూపు వారిని లోకవిరోధులుగానే భావిస్తారు. అనేక కష్టాలకు గురిచేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం తపించేవాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, దానవ, మానవులకు సందర్భానుసారంగా ఆయన కర్తవ్యబోధ చేసేవాడు. అయితే కొంతమంది రచయితలు మాత్రం ఒకరికి ఇంకొకరికి మధ్య కలహాన్ని సృష్టించే వ్యక్తిగా ప్రచారం చేశారు. నారదుడిది ఒక ఉద్దేశ్యం ధర్మ ప్రతిష్టాపన.

"నార” అనగా మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అని, ద అనగా ఇచ్చేవాడనే అర్థం ఉంది. కర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో దుడు. అంతేకాదు నారథుడు ఒక అత్యున్నత సంగీతకారుడు. భగవంతుడైన b. ఆయనకు ఎంతో ఇష్టం తంత్రీవాద్యం, 'వీణ'ను కూడా కనిపెట్టింది. అయన వీణ పేరు మహతి 

వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారదుని నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతా వివరిస్తుంది. నారద పురాణం, పంచరాత్రులు మొదలైన కూడా నారదునికి సంబంధించినవే అలాగే నారద భక్తి సూత్రాలు అనే ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించాడు. ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించాడు. ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై నారద మహర్షి తనదైన పాత్రను పోషించాడు

ఆయన వచ్చాడంటేనే తగవు... అది సత్యాకృష్ణుల  మధ్యే కానీ..

బలరామకృష్ణులే అవనీ.. కృష్ణార్జునులే అయినా..

నిప్పు రాజేస్తే సెగ మొదలే.. అయితే ప్రతి రణం వెనక


కలహభోజుడు..  ఇదీ బిరుదు

నారదుడు వచ్చి వెళ్ళాక 

గొడవ జరక్కపోవడం అరుదు..

ఇక్కడి కబుర్లు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ..

ఏదైనా మంచికే.. చివరకు దుర్మార్గం కథ కంచికే..!


చేతిలో మహతి.. శ్రీహరి శరణాగతి..

నిరంతర నారాయణ నామపారాయణ..మెడలో మాల..

తలకు ముడి..కాళ్లకు పావుకోళ్లు..

కాషాయ వస్త్రాలు..బుర్ర నిండా శాస్త్రాలు...

మాటల అస్త్రాలు.. చూపుల శస్త్రాలు..

విష్ణువుకు ఇష్టుడు..బ్రహ్మకు బేటా..

ఇదీ నారదుడి బయోడేటా..ఇవన్నీ ఇంకెవరికీ రావే..

ఆయన మాత్రం అచ్చం కాంతారావే..!(మన సినిమాలలో )


ఈ  నారదుడే వ్యాసుడి చేత రాయించినాడు భారతం..

వాల్మీకికి ప్రబోధించినాడు 

నారదుని పాత్ర లేనిదే  రక్తి కట్టదు ఏ పురాణం..

హిట్టు కొట్టదు పౌరాణిక చిత్రం..

రావణుడి కోపానికి..సత్యభామ విలాపానికి..

కిట్టయ్య సల్లాపానికి..నరనారాయణ రణానికి..

రామాంజనేయ యుద్ధానికి కృష్ణాంజనేయ సమరానికి..

మంచోళ్లు ఏ ఇద్దరి మధ్య యుద్ధం జరిగినా 

అక్కడ ఆనందంగా నారదయ్య సిద్ధమే..

పేరుకే తంపులు.. చెడుకే తలవంపులు..!

ఓ లోకోత్తర కారణం..

తంటా వెంట ఒక పంట..

కయ్యం సద్దుమణిగినాక కళ్యాణం..అదే నారద పురాణం..!

Monday, September 13, 2021

భాద్రపదమాసం శుద్ధ అష్టమి రాధాష్టమి

 



ప్రియమైన శివ పరివారం కు  కి రాధా అష్టమి శుభాకాంక్షలు

రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ

కృష్ణ ప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణస్వరూపిణీ

కృష్ణ వామాంగ సంభూతా పరమానంద రూపిణీ

కృష్ణా బృందావనీ బృందా బృందావనవినోదినే చంద్రావళీ 

చంద్రకాంత శరచ్చంద్రనిభాననా నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ 
 
భాద్రపదమాసం శుద్ధ అష్టమి ఈ దినమే రాధాష్టమి అని అంటారు.(14-09-21) 
రాధా కృష్ణులు మా ఇంటి దేవతలు . మా తండ్రి గారు కి మా తండ్రి గారు పూజ్య గురువులు కి ఆరాధ్య దైవం , అంతటా రాధా భజే శ్యామలం 

భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. 
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి,విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
 శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.

వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం ‘రాధామాధవం’.


ఇట్లు 
వాణి నా రాణీ 


కచుడు-దేవయాని- శుక్రాచార్యుడు

Date : 13-09-21

ప్రియమైన శివ పరివారం కు భాద్రపద మాస శుభాకాంక్షలు 

మనకి శ్రీ మద ఆంధ్ర bhaaratam కవిత్రయం వారి నిత్యా ప్రవచనం ల ఈ రోజు గురువు గర్ 

కచుడు-దేవయాని- శుక్రాచార్యుడు  గురించివిషయాలు తెలియచేసారు. 

శుక్రాచార్యుడు కి తెలిసిన విద్య అయిన మృత సంజీవిని గురించి తెలియచేసారు.. మనకి కరోనా మహమ్మారి విజృమన సమయం లో గురువు గారు మన అందరి చేత ఆ మృతసంజీవిని ఎలా చదవాలో తెలియచేసారు.. అంత విలువైన మహ మంత్రం ను మనకోసం గురువు గారు మం అందరి చేత ప్రతి నిత్యమూ పారాయన గా చేయించారు
ఈ రోజుశ్రీ మద్ ఆంధ్ర భరతం లో గురువు గారు ఎన్నెన్నో తెలియని విశేషాలు తెలియచేసారు..చండీ సప్తశతి చేసుకునే వారికీ ఈ మృత సంజీవిని గురించి బాగా తెలుస్తుందని గురువు గారు తెలియచేసారు 
ఇక మనం కదా భాగం లోకి వెల్దాము 

దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడుని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవని ఎలాగైనా సాధించుకు రమ్మన్నారు. దాంతో సురలోకం వదిలి అసురలోకం చేరాడు.

            మృత సంజీవని విద్య అంటే చనిపోయే వాళ్ళని  తిరిగి బతికించే విద్య. అది ఒక్క శుక్రాచార్యునికే తెలుసు. అంచేత దేవతలకూ రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ఇవాళ చనిపోయారనుకున్న వాళ్ళు రేపటికి బతికి వచ్చే వాళ్ళు. తిరిగి తిరిగి యుద్ధం చేయడంతో దేవతలకు దిక్కుతోచలేదు. శుక్రునికన్నా నువ్వు శక్తి హీనుడవని బృహస్పతిని నిందించారు. స్వర్గం నుంచి తరిమివేసే పరిస్థితి వచ్చింది. ఆపద సమయంలో కొడుకుని శతృ శిబిరానికి పంపి ఆ విద్యను తీసుకు రావడమే విరుగుడని భావించాడు బృహస్పతి. శుక్రుని సేవించో ఆయన కూతురు దేవయానిని ప్రేమించో కార్యం సిద్ధించుకు రమ్మన్నారు.

            రాక్షస రాజ్యంలో కచుడు అడుగు పెట్టాడు. రాక్షసులు అడిగారు. బ్రాహ్మణుడనని చెప్పాడు.శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేయడానికి వచ్చినట్టు చెప్పాడు. ఇంటికి దారి చూపమన్నాడు. రాక్షసులు దారి తప్పించారు. అడవిలో తిరిగాడు. అలసిపోయాడు. చెట్టు నీడన నిద్రపోతే చెలికత్తెలతో వచ్చిన దేవయాని చూసింది. ముగ్దురాలైంది. కచుడు కళ్ళు తెరిచేసరికి చెలికత్తెలు మాయ మయ్యారు. దేవయాని మిగిలింది. శుక్రాచార్యుల ఇంటికి తోవ చూపమన్నాడు. కోరికను చెప్పాడు. దేవయాని తండ్రి వద్దకు తీసుకెళ్ళింది. చెప్పింది. కాదనలేక పోయాడు శక్రుడు. కచునిపని సులువు చేసింది దేవయాని. వలపు పెంచుకున్నది. కచుడు మాత్రం వచ్చిన లక్ష్యంమీదనే ఉన్నాడు.

            రాక్షసులకి అనుమానం తీరలేదు. ఇంటిపనీ, గురుసేవలూ చేస్తున్న కచుణ్ణి కనిపెట్టారు. చుట్టుముట్టి కత్తి దూసారు. అప్పటికి కచుడు ఆవుల్ని మేపుతున్నాడు. కత్తికోకండగా కచుణ్ణి చంపి నక్కలకు తోడేళ్ళకు ఆహారంగా వేసారు. కచుడు కనపడక దేవయాని తల్లడిల్లింది. తండ్రి చెప్పినా వినలేదు. ఒత్తిడి చేసి మృతుణ్ని సజీవుడిగా చేసింది. మృత సంజీవని మంత్రం పఠించి పిలిస్తే – లేచి వచ్చాడు కచుడు. రెండోసారి కచుణ్ణి చంపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని సముద్రంలో పడేసివచ్చారు. కచునికేదో ఆపద వచ్చిందని చెప్పి విలపించింది దేవయాని. తండ్రిని నిలదీసింది. శుక్రుడు మంత్రం చదివి కచుణ్ణి పిలవడంతో సముద్రంలోంచి నడుచుకుంటూ వచ్చేశాడు కచుడు. తమ ప్రయత్నం ఫలించని రాక్షసులు పట్టుదలగా మరో పథకం వేసారు. దేవతల గూఢాచారిగా కచుణ్ణి భావించి, చంపి కాల్చిబూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి గురువుగారి చేతే తాగించారు. కచుడు కనపడక నిద్రాహారాలు మానేసింది దేవయాని. శుక్రుడు తట్టుకోలేక సరే అన్నాడు. మృత సంజీవని విద్యతో కచున్ని పిలిచాడు. కడుపులోని బూడిద ఒక్క చోటకు చేరి రూపమయింది. జీవమూ వచ్చింది. అందుకే పిలిస్తే పలికాడు. పొట్టలోనే ఉండడం గ్రహించాడు. తాను బయటకు వస్తే నేను చనిపోతానన్నాడు తండ్రి. అలాగని పొట్టలోనే ఉంటే జీర్ణమైపోతాడు. ఏం పాలుపోలేదు. కచుణ్ణి పిలవమంది దేవయాని. పిలిచే ముందు మృత సంజీవని విద్యను అతనికి నేర్పమంది. పొట్ట చీల్చుకు వచ్చినా, చనిపోయిన మిమ్మల్ని బతికిస్తాడని నమ్మకంగా చెప్పింది. కూతురు ఆలోచన నచ్చింది. చెప్పినట్టుగానే పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్యను నేర్పించాడు. తర్వాత పిలిచాడు. శుక్రుని పొట్ట చీల్చుకు వచ్చాడు కచుడు. చనిపోయిన శుక్రుణ్ణి బతికించాడు.

            కచునికి వచ్చిన లక్ష్యం నెరవేరింది. వెళ్ళబోతే దేవయాని పెళ్ళాడమని కోరింది. గురు పుత్రికవు, సోదరితో సమానం అన్నాడు. మూడు సార్లు నాకు ప్రాణం పోసిన శుక్రుడు తండ్రి వంటివాడయితే, నువ్వు ఏమవుతావని తిరిగి ప్రశ్నించాడు. కాదన్నాడు. “నీవు నేర్చిన విద్య నీకు పనికి రాకుండా పోవుగాక!” అని దేవయాని శపించింది. “బ్రాహ్మణ కన్యవైనా నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక!” అని ప్రతిశాపమిచ్చాడు కచుడు. దేవయానిని మించిన అందగత్తెలు కచుని కళ్ళముందు కదలాడారన్న కథలూ ఉన్నాయి. మొత్తానికి తండ్రి అభీష్టాన్ని నెరవేర్చిన కొడుకుగా కచుడు మృత సంజీవని విద్యతో తిరిగి దేవలోకం చేరాడు! 
 ఇట్లు 
శివ పరివారం 

Saturday, September 4, 2021

navaratri ganapati

 నవ్‌రాత్రి, లేదా నవరాత్రి  అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని 

ఆరాధిస్తారు. మనకి గురువు గారు తరచూ చెబుతూ ఉంటారు  నవరాత్రి గురించి . అందులో భాగం గా మనకి ముఖ్యమైన నవరాత్రులు ఈ క్రింది విధం గా చేసుకుంటారు 

నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి, పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి : వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి : ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు : అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి : పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి : గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.

విజయదశమి ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు, 

Friday, September 3, 2021

మహాభారతంలోని మహాపాఖ్యానాలు - గరుడోపాఖ్యానం

Date : 03/09/2021

 ఇప్పుడు శ్రీమద ఆంధ్ర మహా భారతం ను మా పూజ్య గురువు గారు ప్రవచన రూపం లో రోజు ఆన్లైన్ లో మాకు చెబుతున్నారు.. కవిత్రయం వారిది.. అందులో ఈ రోజుతో గరుత్మంతుని జన్మ వృతాంతం అయ్యింది.. తల్లిని దాస్యం నుంచి విముక్తి చెయ్యడం శ్రీ మహా విష్ణువు కి వాహన రూపం లో రావడం.. మొ.. వరకు అయ్యాయి. 

 మహాబలశాలి అయిన గరుత్మంతుడు స్వర్గలోకానికి వెళ్ళాలనే తలంపుతో రెక్కలను గట్టిగా విదిలించాడు. రెక్కల నుండి పుట్టిన గాలికి చెదిరిన పూలన్నీ విజయ సూచకంగా గరుడుడి పైన పుష్పవర్షం కురుస్తోందా అన్నట్లు పడ్డాయి. అమృతాన్ని తేవడానికి గరుడుడు ఎప్పుడైతే ఎగిరాడో అక్కడ ఇంద్రలోకంలో మహోత్పాతాలు పుట్టాయి. “సురవతి సభ చూడంజూడ నంగార వృష్ణుల్ కురిసె, కులిశధారల్ కుంఠితంబయ్యె, దిక్కుం జరమదము లడంగెన్ సర్వదిక్పాల కాంతః కరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్" - 81 ప - ద్వి.ఆ. - ఆదిపర్వము దేవేంద్రుని సభలో నిప్పుకణాలు వర్షంలాగా కురిశాయి. వజ్రాయుధం యొక్క అంచులు పదును కోల్పోయాయి. దిక్కులను మోసే గజాల మదాలు అణగిపోయాయి. సభలో ఉన్న దిక్పాలకులందరి మనస్సులు భయోద్వేగానికి గురయినాయి. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇన్ని అపశకునాలకు కారణమేమిటని ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని అడిగితే - దివ్యదృష్టితో కారణం తెలుసుకొన్నాడు బృహస్పతి. -

• “దేవేంద్రా! గరుత్మంతుని రాకతో ఇన్ని ఉత్పాతాలు చెలరేగాయి. గరుడుడు ఎవరనుకొంటున్నావు? బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన కశ్యప ప్రజాపతి పుత్రుడు. పుణ్యశీల అయిన వినతకు పుట్టిన పాపరహితుడు. వాలఖిల్య మహర్షుల వర ప్రభావం వల్ల పక్షికులానికి ఇంద్రుడైన మహాతేజోమూర్తి. సముద్రంలోని ఘోరభయంకరులైన లక్షలాది నిషాదులను కడుపార మ్రింగిన వీరాధివీరుడు. గజకచ్చపాలు రెంటినీ తన రెక్కలలో ఇరికించుకుని వాయువేగంతో ఆకాశయానం చేసిన బలశాలి. రోహిణి శాఖను క్రింద పడవేయకుండా మహర్షులతో పాటు పైకెగిరి తండ్రిని చేరిన ధీయుతుడు”.


“నూరు యజ్ఞాలు చేసి ఇంద్రపదవి నలంకరించిన సురపతీ! ఒక్కమాట చెబుతాను విను. తన తల్లి అయిన వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృతాన్ని తీసుకుపోదామనే ఉద్దేశంతో గరుడుడు మన లోకానికి వస్తున్నాడు. అందుకే ఈ అపశకునాలన్నీ. అతనిని జయించటం నీకు సాధ్యం కాదు. గరుడుడు కామరూపుడు. కామగమనుడు. మహావీరుడు. సకల సద్గుణ శోభితుడు. మహర్షి వరప్రభావితుడు. అజేయుడు. గరుడుని మాహాత్మ్యం నీకు కూడా తెలుసు మహేంద్రా! పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులు కావాలని కోరి పుత్రకామేష్టి చేశాడు. నీకు గుర్తుందా? ఆ యజ్ఞానికి కావలసిన కట్టెల (సమిధల) ను తేవడానికి నిన్ను, తక్కిన దేవతలను, ప్రముఖులైన వాలఖిల్యాది మహామునులను సహాయపడవలసిందని కోరాడు. అప్పుడు నీవు నీ శక్తికి తగినట్లుగా కట్టెల మోపులను ఎన్నిటినో మోసికొని వస్తుండగా వాలఖిల్యాదులు ఎదురుపడ్డారు. తక్కువ కట్టెల మోపులను మోస్తూ, ఆ బరువును మోయలేక గడగడ వణుకుతున్న వారిని నీవు ఆశ్చర్యంగా చూశావు. గొప్పబలం లేకుండా, బొటన వేలంత శరీరం గలవారిని, నిత్యోపవాసాల చేత కృశించిపోయిన వారిని చూసి నీవు నవ్వావు. నీవు నవ్వేసరికి ఆ మహర్షులు సిగ్గుపడి, తక్షణం కోపించారు.


“రణ విజయుడనలతేజుం డణిమాది గుణాఢ్యుడు దితుడయ్యెడు వీరా గ్రణి శతమఖుకంటెను శత గుణ వీర్యుండైన పుత్రకుండజితుండై" - 85 ప - ద్వి.ఆ - ఆదిపర్వము


సకల మంత్రశాస్త్ర వేత్తలయిన వాలఖిల్యాది మునులు వెంటనే అగ్నిలో సమం చేస్తూ మహావీర్యవంతాలైన మంత్రాలతో వ్రేల్చసాగారు. అలా చేస్తూ ఇంద్రుడి గర్వాన్ని అణగదొక్కాలని “మరో ఇంద్రుడు జన్మించుగాక” అని అన్నారు గదా. అప్పుడు వారింకేమన్నారో కూడా మర్చిపోయావా ఇంద్రా! యుద్ధంలో విజయసాధకుడు, అగ్నితేజుడు, అణిమాది గుణాఢ్యుడు, వీరాధివీరుడు, ఇంద్రునికన్న శతాధిక సద్గుణ సంపన్నుడు, అత్యధిక బలాన్వితుడు అయిన పుత్రుడు, సర్వులకు అజేయుడై జన్మించుగాక. ఆ సుగుణశీలి రెండవ ఇంద్రుడై సకల సన్మంగళాలను పొందుగాక అని తమ తపోబలాన్ని జోడించి వ్రేల్చారు గదా. అది విన్న నీవు భయాందోళనలతో మీ తండ్రిని శరణు కోరావు. నీకాబాలుడు ఎక్కడ సమ ఉజ్జీగా వస్తాడో అని భీతి చెంది, రెండవ ఇంద్రుడు జన్మించకుండా చేయమని కశ్యపమహర్షిని ప్రార్థించావు. వాలఖిల్యులు అఖండ తేజోమూర్తులని, వారి మాటకు తిరుగుండదని తెలిసిన కశ్యప బ్రహ్మ వారిని కరుణించమని కోరాడు. “బ్రహ్మదేవుడు త్రిలోకాధిపత్యాన్ని ఒక్క శతమఖుడికే ప్రసాదించాడని, రెండో ఇంద్రుడుండటం బ్రహ్మవాక్కును అతిక్రమించటమే అవుతుందని” వాలఖిల్యులకు తెలియజెప్పాడు. “కాని బ్రహ్మరులైన మీ వాక్కు వృధా కారాదు కనుక పుత్రకామేష్టి వల్ల నాకు కలగబోయే పుత్రుడు పక్షీంద్రుడౌ గాక, దానికి మీరు సమ్మతించాలి” అని కశ్యపుడు వారిని దానికి అంగీకరింపచేశాడు. అందుచేతనే ఇంద్రపదవి నీ ఒక్కడికే దక్కింది. ఆ విధంగా పక్షులకు రాజైన గరుత్మంతుడు - అమృతం తీసుకుపోవడానికి స్వర్గ లోకానికి రావటం చేత, నీ సభలో ఇన్ని అపశకునాలు కలిగాయి. అంతటి మహా బల సంపన్నుడైన గరుడుని గెలవటం నీవల్ల కానిపని” అని దేవగురువు ఉత్పాతాలకు కల కారణాలు వివరించి చెప్పడంతో మహేంద్రుడు తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనుకున్నాడు. వెంటనే అమృతభాండాన్ని రక్షిస్తున్న సురవీరులందరినీ పిలిపించి, వారిని తగు జాగ్రత్తతో, అప్రమత్తతతో మెలగమని, అమృత రక్షణ అత్యంత ఆవశ్యకమని, తన్నిమిత్తం పరాక్రమవంతులు కండని ఆజ్ఞాపించి పంపివేశాడు. అమృతం ఉన్నచోటుకు వెళ్ళాలనే సంకల్పంతో రెక్కలు విదిల్చి ఎగిరిన గరుడుని సంరంభం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు అమితాశ్చర్యంతో తలమున్కలయ్యారు.


“వితతోల్కాశనివుంజ మొక్కొయనగా విన్వీధి విక్షిప్త ప క్షతివాతాహతి తూలి తూలశకలాకారంబులై వారి ద ప్రతతుల్ సాల్పడి నల్గడం బెదరగా పాటెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్ భయంబందగన్" - ప 91 - ద్వి. ఆ - ఆదిపర్వము


పక్షిరాజైన గరుత్మంతుడు అమృతభాండాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో మనోవేగంతో ఒక్క ఉదుటున పరుగెత్తాడు. గరుడుడు ఆవిధంగా వెళుతున్నప్పుడు ఆ మహాబలశాలి రెక్కల నుండి పుట్టిన ఉధృతమైన గాలి తాకిడికి మబ్బులన్నీ దూదిపింజల ఆకారాన్ని ధరించి నాలుగు దిక్కులకు చెదిరిపోయాయి. ఆ దృశ్యానికి అమృత రక్షకులు భయపడిపోయారు. ఎక్కడ ఆ పక్షిరాజు తమ మీద వచ్చిపడతాడో అని వణికిపోయారు. కాని ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం గరుడుని ఎదుర్కొని తీరాలి. అగ్నిజ్వాలలా అన్నట్లున్న భయంకరమైన పెద్ద రెక్కలు గల మహాశౌర్యవంతుని, గరుత్మంతుని చూసి, అమృత హరణార్థం వచ్చినందుకు క్రోధోన్మత్తులై ఆ పంద్రుని ఎదుర్కొన్నారు. అనేక శస్త్రాస్తాలతో ఆ రక్షకులు గరుత్మంతునితో ఆతనిని పడవేస్తూ, నెట్టివేస్తూ, పొడుస్తూ తమ పరాక్రమాన్ని వెల్లివిరియజేస్తూ యుద్ధం జేశారు. తనను ఎదుర్కొన్న దేవతల దృష్టిని గరుడుడు రెక్కలు విదిల్చి,


నీ బలానికి, శౌర్యా నికి, వేగానికి, లోలత్వం లేనితనానికి, - అన్నిటినీ మించి నీ సద్భావానికి మెచ్చాను గరుడా! నీకు వరమిద్దామని అనుకొని నీ వద్దకు వచ్చాను. నీకు ఏ వరం కావాలో అది కోరుకో. ఇస్తాను. రాక్షస సంహారా! నారాయణా! అమృతం సేవించకపోయినా, నాకు అమరత్వం ప్రసాదించు ప్రభూ! సమస్త లోకాలకు అధినాథుడైన నీ ముందు సర్వవేళలా అత్యంత భక్తితో నిన్ను కొలిచే వరం కోరుకుంటున్నాను. ఈ రెండు వరాలు, కరుణాత్ముడవై నాకనుగ్రహించు. అంతకన్న నాకింక ఏం కావాలి దేవదేవా? నేను అడగక పోయినా, తపమొనర్చకపోయినా, దయాళువవై నాకు నీ దర్శనాన్ని ప్రసాదించావు. నా జన్మ ధన్యమైంది.


దుమారం లేపి, ఆ దుమ్ము పరంపరతో కప్పివేశాడు. ఆ దుమ్ము వర్షంతో స్వర్గలోకమంతా అంధకార బంధురమై పోయింది. అది విన్న ఇంద్రుడు వాయుదేవుని దుమ్ము చెదిరిపోయేటట్లు చేయమని ఆజ్ఞాపించాడు. వాయుదేవుడు దుమ్ము వర్షాన్ని చెదరగొట్టి ఇంద్రుని సంతృప్తి పటిచాడు. భౌమనుడనే వీరుడు రకరకాల ఆయుధాలతో గరుత్మంతుని ఎదుర్కొని అగ్నిలో దగ్గమయ్యే మిడతవలె పక్షీంద్రుని చేతిలో హతమైనాడు. దేవతా వీరులెవ్వరూ గరుడుని ముందు నిలవలేకపోయారు. రెక్కలతో, ముక్కుతో, గోళ్ళతో వైనతేయుడా సురలనందరినీ నెత్తుటి ధారలకు గురిచేయగా, ఆ మహావీరుని చేతిలో పరాజితులై, అశక్తులై ఇంద్రుని వెనక నక్కారు. వివిధ దేవతా జాతులవారు గరుత్మంతుని అసాధారణమైన పరాక్రమం చూసి నిశ్చేష్టులై కింకర్తవ్యతా విమూఢులైనారు. సాధ్యులు గర్వాన్ని విడనాడి తూర్పుదిక్కుగా పారిపోయారు. వసువులు, రుద్రులు ధనహీనులైన విప్రుల మాదిరి దక్షిణను ఆశ్రయిస్తున్నారా అన్నట్లు దక్షిణ దిశగా భీతితో పరుగులెత్తారు. ద్వాదశాదిత్యులు పడమటి దిగంతం చేరుకొంటే అశ్వినీదేవతలు ఉత్తరదిక్కునాశ్రయించారు. ఇక అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, యమధర్మరాజు, నైరృతి అనే దిక్పాలకులు శక్తిహీనులై దిక్కుతోచక కాందిశీకులైనారు. అమృత భాండానికి రక్షకులైన రేణువు, పదనఖుడు మొదలైన వారినందరినీ గరుడుడు తన వాడిగోళ్ళతో చీల్చి చిందర వందర చేశాడు. దేవతా శ్రేష్ఠులనందరినీ తన అమేయబలం చేత ఓడించి అమృతం ఉన్న స్థానాన్ని చేరుకొన్నాడు. అమృతం చుట్టూ ఉన్న అగ్ని జ్వాలలను చూసి వాటిని చల్లార్చటానికి సమస్త నదులలోని నీటినంతటిని తన పుక్కిటబట్టి తెచ్చి అగ్నిలో పోశాడు. అగ్ని పరిధి లోపల యంత్ర రూపంలో ఉన్న చక్రాన్ని చూశాడు. వెంటనే సూక్ష్మదేహం కలవాడై యంత్రచక్రం ఆకుల మధ్యకు చేరాడు. అంతటితో గరుడుడి ప్రయత్నం సరిపోలేదు. ఆ చక్రం క్రింద విషనాగులను చూశాడు.


“ఆ నాగశ్రేష్ఠుల ముఖాలు కోపంతో వికారంగా ఉన్నాయి. అగ్నివలె ఎఱ్ఱగా, భయంకరంగా ఉన్న నేత్రాలతో చూస్తున్నాయి తమ మీదకు ఎవరు వస్తున్నారా అని ఆ సర్పరాజాలు. తమ చూపుల నుండి విషమనే అగ్నిజ్వాలలను ప్రసరింప చేస్తూ ఎవరినీ అమృతం దగ్గరకు రానివ్వకుండా అమృతభాండం చుట్టూ కాపలా కాస్తున్నాయి. మహాభయంకరంగా ఉన్న ఆ రెండు సర్పాలను చూశాడు గరుడుడు. తక్షణం ఉద్దీప్త శౌర్యంతో, తన రెక్కలను విదిల్చి, తద్వారా వచ్చిన దుమ్ముచేత వాటిని గ్రుడ్డివాటిగా చేశాడు. ఆ సర్పశ్రేష్ఠుల శిరస్సులు తొక్కి, వాటిని నిర్వీర్యం చేసి అమృత భాండాన్ని గ్రహించి ఆకాశంలోకి ఎగిరాడు పక్షీంద్రుడు. ఆకాశానికెగిరిన గరుడుడు తన చేతిలో అమృతం ఉన్నా కూడా, దాని మహిమ తెలిసి కూడా ఒక్క చుక్కయినా త్రాగలేదు. కనీసం అమృతం ఎలా ఉంటుందనైనా రుచి చూడలేదు. అటువంటి సుగుణశీలి అయిన వినతాపుత్రుని చూసి సంతోషించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ మహావీరుని ప్రశంసించడం ఆయన అలౌల్యాన్ని, ధీరత్వాన్ని, సద్గుణ సంపత్తిని దశదిశలా చాటుతోంది.


గరుత్మంతుడు ఎవరి గురించి తపస్సు చేయలేదు. కనీసం మనసులోనైనా ఏ దేవునీ ఏ వరమూ కోరలేదు. ఆయనకసలే కోరికా లేదు. మాతృదాస్య విమోచన మొక్కటే ఆయన ధ్యేయం. అది నెరవేర్చుకోవటానికే బయలుదేరాడు. నిర్విఘ్నంగా పని పూర్తి చేసుకొన్నాడు. శౌర్య ప్రతాపాలతో వీరులందరినీ అపజయంపాలు చేశాడు. విజయుడై నిల్చి, ఉత్సాహంతో నాగుల దగ్గరకు పరుగెత్తుతున్నాడు. అదంతా గమనించాడు - జగన్నాథుడైన జనార్దనుడు. గరుడుడి ముందు నిలిచాడు. “నీ బలానికి, శౌర్యానికి, వేగానికి, లోలత్వం లేనితనానికి, - అన్నిటినీ మించి నీ సద్భావానికి మెచ్చాను గరుడా! నీకు వరమిద్దామని అనుకొని నీ వద్దకు వచ్చాను. నీకు ఏ వరం కావాలో అది కోరుకో. ఇస్తాను” అని అనటం విష్ణుమూర్తి వాత్సల్యానికి, ఔదార్యానికి నిదర్శనం. అనూహ్యమైన ఈ సంఘటనకు గరుడుడు ఉప్పొంగిపోయి, విష్ణుమూర్తి పాదపద్మాలకు ప్రణమిల్లాడు. విష్ణుమూర్తి అంతటి స్థితికారుడు వచ్చి నీకు వరమిస్తానని అంటే గరుడుడిలో అనంతమైన భక్తి పెల్లుబికింది. పరమాత్ముని వైపు చూశాడు - వినయ వినమితోత్తమాంగుడైనాడు. పరమాత్ముని కరుణా దృష్టి తనమీద పడడం తన భాగ్యమనుకొన్నాడు. దేవదేవుని చూసి తన కోరిక వెల్లడించాడు.


“రాక్షస సంహారా! నారాయణా! అమృతం సేవించకపోయినా, నాకు అమరత్వం ప్రసాదించు ప్రభూ! సమస్త లోకాలకు అధినాథుడైన నీ ముందు సర్వవేళలా అత్యంత భక్తితో నిన్ను కొలిచే వరం కోరుకుంటున్నాను. ఈ రెండు వరాలు, కరుణాత్ముడవై నాకనుగ్రహించు. అంతకన్న నాకింక ఏం కావాలి దేవదేవా? నేను అడగక పోయినా, తపమొనర్చకపోయినా, దయాళువవై నాకు నీ దర్శనాన్ని ప్రసాదించావు. నా జన్మ ధన్యమైంది” అన్న గరుత్మంతుని వాత్సల్య దృష్టితో చూస్తూ రెండు వరాలూ ప్రసాదించాడు శ్రీమహావిష్ణువు. "పాపరహితుడవైన గరుడా! నీకు మరో రెండు వరాలు కూడా ఇస్తాను. నీ నిజాయితీ, నీ దీక్ష నాకు బాగా నచ్చాయి. ఇకనుంచి నాకు వాహనంగా, పతాకంగా వర్ధిల్లుదువు గాక!” అని లక్ష్మీనాథుడు పలకగానే గరుడుడు "మహాప్రసాదమని” వైకుంఠవాసుడికి మరల మరల మ్రొక్కి తన పయనాన్ని కొనసాగించాడు. విష్ణువూ అంతర్జానం చెందాడు. అప్పటికి గరుడుడి దగ్గరకు వచ్చిన మహేంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసి పక్షీంద్రుడి పైకి విసిరాడు. వజ్రాయుధం నిప్పురవ్వలను ఆకాశమంతటా వెదజల్లుతూ గరుడుని రెక్కలను హరించటానికి, సమీపానికి వచ్చేసరికి ఆ ఆయుధాన్ని చూసేటప్పటికి మహాబలవంతుడైన గరుడుడికి నవ్వు కలిగింది - "అదెంత? దాని బలమెంత?” అని. “వజ్రాయుధమా! నీవు పెట్టగలిగిన బాధ నన్నేం చేయలేదు సుమా! నీవు మహాముని త్యాగధని అయిన దధీచి వెన్నెముక నుండి ఏర్పడిన దానివి కావటం వల్ల నిన్ను నేను ఏమీ చేయను. అంతేగాక త్రిలోకనాథుడైన దేవేంద్రుని ఆయుధం కావటం వల్ల కూడా నిన్నవమాన పరచటం నా అభిమతం కాదు. అందుచేత నా రెక్కలోని ఒక ఈకను మాత్రము ఛేదించి మరలిపొమ్ము. నామీద నీకున్న శక్తి అంతే సుమా” అని గరుత్మంతుడనగానే సకల లోకవాసులు అతని రెక్కల బలాన్ని ప్రశంసించి ముగ్గులైనారు. గరుడుని "సుపర్లు”డని పిలిచి ఎంతగానో అభినందించారు. దేవేంద్రుడు సహితం ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. గరుడుని స్తుతించకుండా ఉండలేకపోయాడు - అతడు తమ్ముడయినప్పటికీ. ఇద్దరి తండ్రీ కశ్యప బ్రహ్మే కదా!


“నిరుపమాన శౌర్య! నీతోడ చెలిమిసే యంగ నాకభీష్టమైన యదియు నిట్టి విక్రమంబు, నిట్టి సామర్థ్యంబు కలదె! యొరుల కిజ్జగంబునందు" - 108 ప - ద్వి. ఆ - ఆదిపర్వము


“మహాపరాక్రమశాలీ! గరుడా! నీ శౌర్యంతో సాటి రాగలవారెవరైనా ఉన్నారా? నీకున్న పరాక్రమంగాని, శక్తి సామర్థ్యాలు గాని ఈ జగత్తులో వేరెవరికైనా ఉన్నాయా? లేవే! అటువంటి మహా బలశాలివైన నీతో స్నేహం చేయాలని ఉంది. మనం సోదరులమే కదా! నీకందుకంగీకారమేనా? మరొకమాట -


“అమరుడ వజరుడ వజితుడ వమేయుడవు; నీకునమృత మదియేల? ఖగో త్తమ! దీని నొరుల కిచ్చిన నమరులకును వారసాధ్యులగుదురు పోరన్" - 109 ప - ద్వి. ఆ - ఆదిపర్వము


“నీవు మరణం లేనివాడివి. వృద్ధాప్యం ఏర్పడని వాడివి. ఇతరుల చేత జయింపబడనివాడివి. సాటిలేని బలపరాక్రమాలతో శోభిల్లేవాడివి. పక్షినాథా! నీకెందుకయ్యా అమృతం? నీవే కావాలని కోరితే అమృతం లభించదా? అసలు నేనివ్వనా? మహా మహిమాన్వితమై, క్షీరసాగరం నుంచి ఉద్భవించిన దానిని, ఈ అమృతాన్ని వేరెవరికైనా ఇస్తే ఇంకేమైనా ఉందా? అమృతపానం చేసినవారు యుద్ధంలో దేవతల వల్ల పరాజితులు కారు. మాకు అసాధ్యులే అవుతారనుకో. అమృతాన్ని గ్రహించి నీవు తీసుకుపోతున్నది - నీకు కాదని నాకు తెలుసు. కనుక అన్యులకు తీసుకుపోతున్న అమృతాన్ని దయచేసి వారికి ఇవ్వవద్దు. తిరిగి నాకమృతాన్ని ఇస్తే నీకిష్టమైన విధంగా నేను చేస్తాను” అని ఇంద్రుడు తన మనసులోని మాట చెప్పగానే గరుడుడు సంతోషించి తానెందుకు అమృతాన్ని తీసుకుపోతున్నాడో ఇంద్రుడికి తెలియజెబుతాడు.


“మహేంద్రా! నా మాతృమూర్తికి కలిగిన దాస్యం నుంచి ఆమెను, ఆమెతో పాటు నన్ను విముక్తులను చేయటానికే ఈ అమృతాన్ని తీసుకుపోతున్నాను. అమృతం ఎందుకంటావేమో? విను. కద్రువకు, ఆమె పుత్రులయిన నాగులకు అమృతం తెచ్చి ఇస్తే గాని, వారు మా దాస్యాన్ని పోగొట్టమని చెప్పారు. అందుకని, ఈ అమృతాన్ని సర్పరాజులకిచ్చి నా తల్లి అయిన వినతాదేవి దాస్యాన్ని వదిలించి, ఆమెను సంతృప్తి పరచాలని, నీ రక్షణలో ఉన్న అమృతాన్ని తీసుకుపోతున్నానే గాని, మరెందుకూ కాదు. అయితే ఒక విషయం చెబుతాను విను. నీవనినట్లు అమృతాన్ని వేరెవరికిచ్చినా వారు అమరులై మీకసాధ్యులౌతారు. కనుక ఆ సర్పరాజులకమృతాన్నిచ్చి నేను, నా తల్లిని తీసుకొని వెళ్ళిపోతాను. వారా అమృతాన్ని త్రాగకముందు నీవాభాండాన్ని తీసుకొని వెళ్ళిపో” అని చెప్పగానే గరుడుని మహానుభావిత్వాన్ని ఇంద్రుడు మెచ్చుకొని, ఇంకా వినాలనే కుతూహలంతో 'నీ బలపరాక్రమాల గురించి చెప్పు పక్షినాథా!' అని అడుగుతాడు. దేవేంద్రా!


“పరనిందయు, నాత్మగుడో త్కర పరికీర్తనము చేయగా నుచితమె స త్పురుషుల? కైనను నీక చ్చెరువుగ నా కలతెఱంగు చెప్పెద ప్రీతిన్" - 112 ప - ద్వి. ఆ - ఆదిపర్వము “ఇతరులను నిందించటం అనేది, తన గుణాలను తాను పొగడుకోవటమనేది సత్పురుషులు చేయదగిన పనేనా? కాదుగదా! అయినప్పటికీ నీవు అడిగినందుకు నీకాశ్చర్యం కలిగేటట్లుగా, సంతోషంగా, నా గురించి ఉన్న విషయం నీకు చెబుతాను”.


“స్థావర జంగమప్రవితతంబగు భూవలయంబు నెల్ల నా లావున పూనితాలు, నవిలంఘ్య పయోధి జలంబులెల్ల ర త్నావళితోన చల్లుదు బృహన్నిజ పక్ష సమీరణంబునన్ దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు త్రివిష్టపంబులన్" -113 ప - ద్వి.ఆ - ఆదిపర్వము -


“ప్రాణవంతములైన సమస్త జీవరాశులతో, అచరాలైన సకల వస్తుజాలంతో నిండి ఉన్న భూవలయాన్నంతటినీ నా బలంతో మోస్తాను. అంతేకాదు, నా యొక్క రెక్కలను వీచటం వల్ల కలిగే మహా వాయు ప్రసరణంతో, చాట చేతగాని సముద్రంలోని జలాన్నంతటినీ అట్టడుగున ఉన్న రత్నాలతో సహా వెదజల్లుతాను. ఈ క్షణంలో మూడు లోకాలు తిరిగి నీవద్దకు టెప్పపాటు కాలంలో తిరిగివస్తాను” అని ఇంద్రుడి వైపు చూశాడు గరుత్మంతుడు. ఇంద్రుడి ఆశ్చర్యానికి అవధుల్లేవు. “అంతబలశాలా గరుడుడు” అని అనుకొన్నాడు. గరుడుని శక్తి సామర్థ్యాలకు, మనో వాయువేగాలకు ఎంతగానో మెచ్చుకొన్నాడు. "వైనతేయా! నీవు నాతో ఎప్పుడూ మిక్కిలి సఖ్యంతో మెలగాలి. నేను కోరిన విధంగా నాకిష్టమైన పని చేస్తానని చెప్పావు. నాగులు అమృతం సేవించకముందే నేను వెళ్ళి అమృతం తెచ్చుకుంటాను. అదిసరే. నీకిష్టమైనది చెప్పు. నేను చేస్తాను” అన్న ఇంద్రుని పలుకులకు సంతోషించిన గరుత్మంతుడు తన అభీష్టాన్ని తెలియజేయాలనుకొన్నాడు. “సురేశ్వరా! మాకింత అన్యాయం చేసిన మదోన్మత్తులయిన ఆ కద్రువ పుత్రులు నాకు ఆహారమయ్యేటట్లు చూడు.


“భవదభిరక్ష్యములగు నీ భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్ దివిజాధిప! నీకెటిగిం పవలసి; నీ యాజ్ఞ నాకు పడయగ వలసెన్" - 116 ప - ద్వి.ఆ - ఆదిపర్వము


ఆ మాట నిన్నే ఎందుకడుగుతున్నానంటే దానికో కారణముంది. అదేమిటంటే - నీ పాలనలో, నీ రక్షణలో ఉన్న ముల్లోకాలలో పాములు సంచరిస్తుంటాయి గదా! నాగజాతే నాకు శత్రుకూటమి అనుకో. వాటిని భక్షించటానికి నీ ఆజ్ఞ కావాలి. నీ అనుమతితో పాములను ఆహారంగా పొందుతానని నీకు తెలియజేస్తున్నాను. ఇదే నాకిష్టమైన విషయం . నీవు చెప్పమన్నావు గదా అని చెబుతున్నాను” అని గరుడుడనటంతో సంతుష్టుడైన గరుడుడు అమృతభాండంతో కద్రువ గృహన్ముఖుడు కాగా, ఇంద్రుడదృశ్య రూపంలో పక్షినాథుని అనుసరించి నాగులున్న చోటికి వెళ్ళాడు. నాగమాత అయిన కద్రువను, ఆమె సుతులను చూసి అమృతభాండాన్ని ఆకుపచ్చని దర్భలపైన ఉంచి ప్రీతితో చూస్తున్న పెదతల్లిని చూశాడు. తన మనసులో పేరుకుపోయిన బాధను మనసులోనే ఇముడ్చుకొని, తల్లి దాస్య విముక్తి ఒక్కటే తన లక్ష్యమని భావిస్తూ, తన ప్రతిజ్ఞా నిర్వహణను కద్రువ ముందు వెల్లడించాడు గరుడుడు.


“జననీ నీవమృతంబు తెమ్మనిన, యాసత్యోక్తి పాటించియేx జని నానావిధ కర్మ కర్మరుడవై సాధించి, వేతెచ్చితిన్ విను, నా నీ యెడబాటు సెల్లె జనులన్ విన్పించితిన్ దెల్లగా వినతం దోడ్కొని పోయెదన్ మనమునన్ విభ్రాంతి లేకుండుమీ!" - 263 ప - ప్ర.ఆ - ఆనుశాసనిక పర్వము


“అమ్మా! నీవన్న మాట ప్రకారం , మాట మీద నిలబడి, వెనువెంటనే మీకు అమృతం తెచ్చాను. ఇదిగో అమృతభాండం. ఈ అమృతాన్ని ఎంత కష్టపడి సాధించానో మీకు తెలియదు. వీడమృతం తేగలడా? తెచ్చాడా అని భ్రాంతి చెందకు. తెచ్చి చూపించాను గదా! నీ, నా మధ్య ఉన్న ఒప్పందం చెల్లిపోయింది. నా తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేయటానికే ఈ పని చేశానని, జనులందరికీ తేటతెల్లంగా చెప్పాను. ఒప్పందం తీరిపోయింది కనుక ఇక మా అమ్మను తీసుకొని నేను వెళ్ళిపోతాను” అని చెప్పి నాగులను చూసి పవిత్రమైన అమృతాన్ని ఏవిధంగా ఆస్వాదించాలో విడమరచి చెబుతాడు గరుడుడు. "సోదరులారా! నాగశ్రేష్ఠులారా! మీరు ముందుగా స్నానం చేసి, ఆ తరవాత అలంకరించుకొని, పవిత్రాత్ములై అప్పుడు అమృతాన్ని త్రాగండి” అని వినతాపుత్రుడు చెప్పడంతో కాద్రవేయులందరూ సంతోషంతో ఒకరినొకరు అతిక్రమిస్తూ స్నానం చేసి రావటానికి పయనమయినారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ అదృశ్య రూపంలో ఉన్న దేవేంద్రుడు ఎవరికీ కనబడకుండా అమృతభాండాన్ని తీసుకొని వెళ్ళి యథాస్థానంలో ఉంచి మరింత రక్షణ కల్పించాడు. స్నానాలంకృతులై వచ్చిన నాగశ్రేష్ఠులకు అమృతభాండం కనిపించలేదు. ఎటు చూసినా అమృతం కనబడలేదు. గరుడుడూ కనబడలేదు. తామున్నప్పుడే వినతాసహితుడై గరుడుడు వెళ్ళిపోయాడు గదా అని అనుకొని ఒక నిట్టూర్పు పుచ్చారు. అమృతభాండం పెట్టిన చోట పడి ఉన్న అమృత బిందువులను నాకుదామనుకొని, కొంతైనా అమృతం దక్కుతుంది, అని దర్భలఅఉ నాకారు. దర్భల అంచులు మిక్కిలి పదునుగా ఉండడంతో నాగుల నాలుకలు రెండుగా చీలిన కారణం వల్ల వారప్పటినుంచి ద్విజిహ్వులుగా పేర్కొనబడ్డారు. దర్భలపైన అమృతం చిలకడంతో అతి పవిత్రమైనవిగా అవి స్వీకరింపబడుతుండేవి.

ఇట్లు 

శివ పరివారం 


Sunday, August 8, 2021

ప్రకాశం ఫామిలీ


కీర్తి శేషులు శ్రీ.  రాణీ ప్రకాశ శర్మ గారు  గురించి కొన్ని మంచి మాటలు 

ర్యాలీ గ్రామ వాస్తవ్యులు , హరితస గోత్రికులు , రాణీ వారి వంశస్తులు  , సూర్య పుత్రులు (తండ్రి గారు సూర్య నారాయణ ), నిత్య ఆదిత్య హృదయ పఠనం  / సుందర కాండ పారాయణులు , పరమ భాగవతోత్తములు అయిన మా తండ్రి గారు  సూర్య ప్రకాశములు  

కఠినత,నియమము,నిష్టయు, తో అఖుంటిత దీక్ష తో,

హఠమున ముద్రలు సలుపగ అంగుళి తోడన్

చేతిన నొసటస అడ్డ విభూతి పట్టె

చెలగె సంప్రదాయ శిఖయె శిరమునందు ధరించే,

రక్షణ కై గాయత్రి , సుందరాకాండ పారాయణ   చేయు మా తండ్రి గారికి  గారికి ముందుగా పాదాభివందనం

మా నాన్నగారు  భాషా ప్రవీణులు తో పాటు డిగ్రీ ని కూడా పూర్తి చేసి , అనేక ప్రైవేట్ కంపెనీ లో పని చేసి చివరిగా ప్రభుత్వ  ఉద్యోగం లో స్థిరపడి  రిటైర్మెంట్ జీవితం ను కూడా ఒక ప్రణాళిక గా తయారుచేసుకున్న వ్యక్తి  , 

తండ్రి గారు శ్రీ రాణీ సూర్య నారాయణ గారు ర్యాలీ జిల్లా పరిషత్ పాఠశాల లో  ఉపాధ్యాయులు  గా పనిచేసి, ఎందరెందరి కో మంచి విద్యని అందించి , మంచి రంగాలలో నిపుణులు అయ్యే విధం గా తయారు చేసిన విద్యా దానం చేసేన మహానుభావులు.. ఆయనది చాల మెత్తని స్వభావం. దయార్ద్ర హృదయులు. వారి సంతానం అందరు ప్రభుత్వ రంగం లో పనిచేసి చివరికి రిటైర్మెంట్ లోను , చివరి దశ   వరకు కూడా ఎవరిమీద ఆధార పడకూడదు అనే సంకల్పం తో వారిని ఆశీర్వదించిన మహా వ్యక్తి.  పాఠశాలలో తెలుగు అధ్యాపకుని గా  పనిజేసి రిటైర్మెంట్ ని అదే  కల ను సార్ధకం చేసుకోలేకపోయారు.   

ఇక మా నాన్నగారు అయిన రాణీ వెంకట సూర్య ప్రకాశం శర్మ గారు  పరమ శివ భక్తులు. తానూ నమ్ముకున్న సూర్య భగవానుడు ని ప్రతి నిత్యమూ ఆదిత్య హృదయం పారాయణ తో ప్రార్ధించే వారు.. , అలాగే సుందరా కాండ పఠనం ఎప్పుడు చేస్తూనే ఉండేవారు .. ఏ కష్టం , సుఖం వచ్చిన ఆ  స్వామి హనుమతో చెప్పుకునే వారు , సుందరా కాండ పారాయణ రూపం లో స్వామి కి తన విన్నపం ను తెలియచేసే వారు..  మా నాన్నగారు ఎప్పడు సుందరా కాండ పారాయణ చేసిన ఆ స్వామి వారు మా ఇంటికి కోతి రూపం లో వచ్చే వారు ..  స్వామి  ఉన్నారు అనే నమ్మకం అయన ని ముందుకు నడిపించేది 

మా నాన్నగారు  మహర్షిలా జీవితాన్ని గడిపే వారు .. చివరికి మౌన ముని లా తనలో తానె రమిస్తూ ఒక రమణ మహర్షి లా మా అందరికీ కనిపించే వారు. 

చిన్న వయస్సు లోనే సంస్కృతాంధ్రాలను  తన తండ్రి గారు వద్ద నేర్చుకున్న వ్యక్తులు మా నాన్నగారు , వారి అన్నదమ్ములు . వాళ్ళు ఆరుగురులు   


మా నాన్న గారి చెంత కూర్చున్న చాలును

మాకు పట్టువడెడి వరము దొరకు!

వారు కరుణ తోడ నేరుపు మంత్రము

భావి తరాల పదిల పరచు బాట యగును! 

కానీ ఇక మాకా అదృష్టం  కరువయ్యెను  

 

ఆలా మా నాన్నగారు / మా నాన్నమ్మ మా  చిన్నతం నుంచి మా అందరికీ బోలెడు కధలు మంచి విషయాలు నేర్పించారు . 

చెప్పువారు లేక చింతింతు రెందరో

చెప్ప గలను నేను చేర రండు

అనెడి మా నాన్నమ్మ  గారి కాయుష్షనంతమై

రాణీ వారి వంశం వృధ్ది చెందు గాత! 


ఆలా మా నాన్నగారు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఉంటుంది.. ఎందుకంటే జీవితం ను కాచి వడపోసిన  మహా మనిషి.


మనకి లాక్ డౌన్ లో కొంత ఇబ్బంది అయినా ఆ సమయాన్ని నేను కొంత సద్వినియోగ పరిచినను 

లాక్ డౌన్ మొదలు అయినా దగ్గర నుంచి నిత్యం భాగవతం, ఈశ్వర సేవ, అలాగే మా తండ్రి గారు తో చాల సమయం గడపడం , పుస్తకాలూ చదవడం మొ.. చేసాము 

అప్పుడు తెలిసింది మనం గడిపిన కాలం, కొన్న పుస్తకాలూ, అసలు ఏమి జరిగింది ఇన్ని సం.. అని రీలు తెప్పను. 

ఎన్నో ఫ్లాష్ బ్యాక్ లు, రింగులు రింగులు తిరిగాయి.. ఇక పుస్తకాలూ అలమారు దగ్గరకి వెళ్ళాను మా నాన్నగారు చదివిన పుస్తకాలూ , కొన్న పుస్తకాలూ చూసాను , అది ఒక గ్యాన నిధి, భాండాగారం అనిపించింది , మా నాన్నగారు అంటే  అనుభవాల గనులు, స్వాతంత్య్రానికి పూర్వమే పుట్టిన మనిషి కదా.. ఎంత కష్టపడి తే కానీ ఈ స్థాయి లో ఉన్నారు.. ఇప్పుడంటే మా నాన్నగారు వృధాప్యం లో ఉన్నారు , 

ఒక్క నాడు తలకి రంగు వెయ్యని వారు జుట్టు తెల్లబడిన  కేశాలవాడు మా నాన్నగారు ,  అంతర్గతంగా తలపండిన పండితుడు అని అయన చదివిన పుస్తకాలు చుస్తే తెలిసింది . మా నాన్న గారు బాహ్యంగానే గాదు అంతరంగా కూడా తల పండిన వృద్ధుడే.

మా నాన్నగారు ఫోటోస్ అన్ని ఒకచోట పొందుపరచి ఆల్బం చేసి చూస్తుంటే తెలిసింది అయన  ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు అయ్యారు అని. వృధాప్యం లో ఉన్న తల్లిదండ్రులు ని ఎవరిని పలకరించినా  చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాళ్ళు  అవుతారు, ఎందుకంటే వాళ్ళ గత సృతులు ని గుర్తు చేస్తాయి కాబట్టి.. 

చివరిగా మనం లాక్ డౌన్ పేరు తో కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటె ఏమి చెయ్యాలో ఒక్కోసారి తెలియని పరిస్థితి.. బయటకి వెళ్లలేని , తిరగలేని వాళ్ళం అయ్యాము , మా నాన్నగారు ని చూసినప్పుడల్లా అదే అనిపిస్తోంది.. ఎన్ని సం నుంచి లాక్ డౌన్ లో ఉంటున్నారో ...

ఎప్పుడు చుసిన మా నాన్నగారు కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికం గా ఎదో నామస్మరణా చేసుకుంటూనే ఉంటారు.. అదే వారికీ శ్రీ రామ రక్ష 

ఇప్పటికే నాన్నగారు ని ఉదయమే నిద్ర లేపాలి సూర్యోదయం కి ఎదురుగా వీల్ చైర్ లో కూర్చుపెడితే ఆ ఆదిత్యుని చూస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటూ జపించుకుంటూ ఉంటారు . మా నాన్నగారు కి ఏ కష్టం వచ్చిన , మంగళ కరం జరిగిన ఆ స్వామి వారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ సుందరాకాండ పారాయణ చేసుకుంటారు.. ఎందుకంటే మనమందరం  పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు కాబట్టి..   రోజు సాయంత్రం మా నాన్నగారు ని తయారు చేసి మా గవాక్యం లో కూర్చోబెడితే మా ఇంటిని కాచే ఈశ్వరుడు మా నాన్నగారు ,మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం.

మా నాన్నగారు కి ఈ వయసులో కూడా అలుపెరకుండా , విరామం విశ్రాంతి ని కూడా పక్కన పెట్టి సేవ చేస్తున్న మా తల్లిగారుకు ఇదే మా నమస్సుమాంజలి లోకం లో అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి , కనిపించే దేవత అమ్మ అయితే నడిపించే దైవం నాన్న!ప్రేమించడం అమ్మ వంతయితే.. దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న.

నాకు ఈశ్వర సేవ ఎంత ముఖ్యమో అంత కన్నా గొప్పది పితృసేవ అని నా అభిప్రాయము. నాన్నగారు కి స్నానం చేయిస్తుంటే రుద్రుడి కి  అభిషేకం చేస్తున్న భావన తో స్నానం సమర్పయామి అన్నట్టు,పౌడర్ ,తిలక ధారణ   విభూది ధారణ చేస్తున్నపుడు స్వామికి అలంకరణ చేస్తున్నట్టుగా భావిస్తున్నాను.స్వామి వారికి చెయ్యాలిసిన ఉపచారాలు అన్ని నాన్నగారికి ప్రత్యక్ష ముగా చేస్తున్న భావనతో చేస్తున్నాను..అంతకంటే ఏమి కావాలి..

అయన జీవితం ఒక "ప్రకాశ" వంతం మాకు ఇచ్చారు ఒక  "సూర్య" వంశం ను  ..   ఆయన పేరులోనే గాదు, జీవితంలో గూడా సూర్య ప్రకాశమే, ఆయన "మానసం" నిండా కృష్ణుడే కనుకనే మా యింట కృష్ణ మానసయై వెలిసింది 

మాకు రాణి యును, వాణి యు, సూర్యయు, శర్మ గా ఈ లోకమునుకు పరిచయ చేసి మమ్మల్ని ఉజ్వలంగా ఉంచడానికి పడ్డారు ఎంతో కష్టం, మాకునొక బ్రద్కును జూపిన మీకు దండముల్.


ఒక రకం గా మా నాన్నగారు వారి చిన్న తనం లో చాల కష్టపడ్డారు.. మా అమ్మ ఈ విషయం ను మాకు చాల సార్లు చెప్పేది.. వినే అవకాశం నాకు లభించింది.. 

పాపం మా అమ్మగారు మా నాన్నగారు చివరి నిమిషం వరకు ఎనలేని సేవ చేసారు..

చిన్న పిల్లలకి ఎలా సేవ చేస్తారో అలాగే చేసి మా నాన్నగారు మంచి గా హాయిగా పడుకుంటే అప్పుడు నేను అమ్మ ఆలా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం.. 

మా అమ్మగారు వారి చిన్న తనం విశేషాలు , పడ్డ కష్టాలు , మా నాన్నగారు జీవితం గురించి చాల సార్లు చెప్పింది.. మా నాన్నగారు పడ్డ కష్టం మాములు కష్టం కాదు..

మా అమ్మ చాల సార్లు అంటూ ఉంటుంది.. వెర్రి బ్రాహ్మణుడు అని.. నిజమే 

మా నాన్నగారు ని ఒక ఆదర్శం గా తీసుకుంటే జీవితం సాఫీగా వెళుతుంది.. ఎవరిని ఇబ్బంది పెట్టె వారు కాదు 

ఎలా అంటే 

ధర్మానువర్తన మర్మమ్ము లెరిగిన

విమల చరిత్రుడౌ విప్రు డితడు!

భాస్కరానుగ్రహమ్మును బడసె నితడు!

సంస్కృతాంధ్రమ్ము లందున చతురుడితడు!

తండ్రి పదమునకే గొప్ప పరువితండు! 

అన్నట్టు గా మా జీవితానికి ఒక మార్గ దర్శకునిగా నిలిచారు..

సశేషం 

ఇట్లు 

ప్రకాశం ఫామిలీ 


Thursday, July 1, 2021

కుచేలోపాక్యనం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపేక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం. ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి.వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారుఅటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు.అటువంటి శ్రీ మద ఆంధ్ర భాగవతం ను మనకి 16 నెలలనుంచి నిర్విఘ్నం గా, నిరాటంకం గా ,  గంగా ప్రవాహం లా మనకి మన శివ పరివారం కు అందించిన మహా పురుషులు మన పూజ్య గురువు గారు.. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ పోతనగారి మన గురువు గారు రూపం లో వచ్చి మనకి ఈ భాగవతం ను తెలియచేస్తున్నారు అనిపించింది .అంత శివ సంకల్పం 

గురువు గారు చెప్పిన ప్రవచనం లో ఈ ఘట్టం చాల బాగుంది..గురువు గారు చెబుతున్నారా సేపు కుచేలుడు ఎలా ఉన్నారో , శ్రీ కృష్ణుడు ఆయనకి ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతారో అంత కళ్ళకి కట్టినట్టుగా మాకు చెప్పారు 

కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . 

చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు .

కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని ఆయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం . ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు

ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి

కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు. ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నారు ,, ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి.

కుచేలుడు  వస్తుంటే కృష్ణుడు, రుక్మిణి దేవితో కలిసి స్వాగతం చెప్పి ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు , , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు. ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కడగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి , ఆయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,,శ్రీ కృష్ణడు   స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు 

కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు

కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది. అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం.

అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి. కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. అని గురువు గారు తెలియచేసారు..

ఇట్లు 

శివ పరివారం 

Friday, June 18, 2021

బలరాముడు తీర్ధ యాత్ర

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

గంగా ప్రవాహం లా నిత్యం జరిగే మా శ్రీ మద్ భాగవతం ఇప్పుడు దశమ స్కంధం లో ఉత్తర భాగం లో బలరాముడు తీర్ధ యాత్ర లోకి వచ్చాము.

సాధారణం గా మనం పుణ్యకేత్రం కి వెళ్ళినప్పుడు చెయ్యవలసిన పనులు లో ముఖ్యం గా 

దానము , జపము, తర్పణం స్నానం లాంటివి ముఖ్యమైనవి అది చేస్తేనే అది తీర్ధ యాత్ర అవుతుంది.. లేకపోతె అది విహార యాత్ర అవుతుంది..

బలరామావతారము అంటే మహావిష్ణువు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి.  శ్రీమహావిష్ణువు యొక్క శ్వేతతేజస్సు బలరాముడుగానూ, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగానూ అవతరించి దుష్టశిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది.  బలరాములు వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు.

ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు,  వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసినారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నది ఆవిర్భావానికి … నాగావళి నదీతీరాన పంచలింగాల ప్రతిష్టకి ఈయనే కారణము

భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడిని గురించి కూడా కొన్ని వివరణలు, కథలు కనిపిస్తాయి. బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు.. దేవకీదేవికి సప్తమగర్భం కలిగింది. అప్పుడు దేవకిని, వసుదేవుడిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది. సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్‌ కర్షణాత్‌ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు.

బలవంతులందరిలోనూ శ్రేష్టుడు కనుక బలదేవుడు అన్నారు. రామశబ్దానికి సుందరం అనే అర్ధం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగివున్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి, బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు. ఈయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుంది.

బలరాముడు గదాయుద్ధ ప్రావీణ్యుడు

గధాయుద్ధంలో   బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. విశేషించి దుర్యోధనుడు, పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెళుకవలను నేర్చుకున్నాడు.

కురుక్షేత్ర సమయంలో తీర్థయాత్రలు చేసిన బలరాముడు,

అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు.

గోమతీం గండకీం స్నాత్వా విపాశాం శోణ ఆప్లుతః | గయాం గత్వా పితౄనిష్ట్వా గంగాసాగరసంగమే ॥ ఉపస్పృశ్య మహేన్ద్రదౌ రామం దృష్ట్వాభివాద్య చ ॥ సప్తగోదావరీం వేణాం పంపాం భీమరథీం తతః ॥ స్కన్దం దృష్ట్వా యయౌ రామః శ్రీశైలం గిరిశాలయం | ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాద్రిం వేంకటం ప్రభుం ॥ కామకోష్టీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం | శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః IIఋషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా! సాముద్రం సేతుమగమత్మాహాపాతకనాశనం ॥

బలరాముడు గోమతి, గండకి, విపాశ నదులలో స్నానమాడెను రో యందును అతడు క్రుంకులిడెను. గయకు వెడలి ఆతడు పితరులను ఆరాధించెను. గంగాసాగర సంగమ స్థానమున ఆతడు పవిత్రస్నానము కావించెను. మహేంద్ర పర్వతము చెంత అతడు పరశురాముని దర్శించ స్తోత్రము కావించెను. పిదప సప్త గోదావరులలో స్నానమాడి వేణ, పంపు భీమారథి యను నదులలో కూడ అతడు స్నానమాడెను. పిమ్మట బలరాముడు. స్కందుని కలిసికొని గిరీశుని ధామమగు శ్రీశైలమును దర్శించెను. ద్రవిడదేశమని తెలియబడు దక్షిణ ప్రాంతమున అతడు పవిత్ర వేంకటాచలమును, అట్లే కామకోష్టిని, కాంచీపురమును, నదీశ్రేష్ఠమగు కావేరిని, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అవతరించియున్నట్టి పరమ పవిత్రము శ్రీరంగ క్షేత్రమును దర్శించెను. అచట నుండి అతడు హరిక్షేత్రమగు ఋషభ పర్వతమునకు, దక్షిణ మథురకు వెడలెను. తరువాత అతడు మహాపాతక నాశనమగు సేతుబంధమునకు చేరెను.

నలభైరెండురోజుల తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామం చిట్టచివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు.

మనకి శ్రీ మద్ భాగవతం లో మన ధర్మ ఆచరణములు ఎలా నిర్వర్తి0చాలో తెలియచేసింది 

ఇట్లు 

శివ పరివారం 

Monday, June 14, 2021

దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.

 


దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము.
రతీదేవి ప్రద్యుమ్న సహితయై గగన మార్గంబున ద్వారకకు బోవుట.
శ్రీ కృష్ణుండు లోకాపవాడ నివృత్తి కొఱకు స్యమంతక మణిన్ దెచ్చుట.
శతధన్వుడు సత్రాజితుని జంపి మణినపహరించుట.
శ్రీ కృష్ణుండింద్రప్రస్థ పురంబునకరుగుట.
శ్రీ కృష్ణుండు కాళిందీ మిత్రవింద నాగ్నగితి భద్ర లక్షణల బరిణయం బగుట.
శ్రీ కృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట.
సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట.
భూదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు పదాఱు వేల కన్నియల వరించి దేవ లోకమునకు బోయి పారిజాతము తెచ్చుట.
శ్రీ కృష్ణుండు కేళీ గృహమునందు రుక్మిణీ దేవితో విరసోక్తులాడుట.
రుక్మిణీ దేవి శ్రీ కృష్ణ లాలితయై యతని స్తుతించుట.
శ్రీ కృష్ణుండు రుక్మిణీ దేవి నూఱడించుట.
బాణాసురుండీశ్వర ప్రసాదంబు నొందుట.
బాణాసురుండనిరుద్ధుని నాగ పాశ బద్ధుని జేయుట.
నారదుని వలన ననిరుద్ధుని వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట.
బాణాసురుని సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట.
బాణాసురుండు రెండవ సారి యుద్ధమునకు వచ్చుట.
శివుడు బాణుని రక్షింప శ్రీ కృష్ణుని స్తుతించుట.
ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురంబున కరుగుట.
నృగ మహారాజు చరిత్రము.
బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్థమై వ్రేపల్లెకు బోవుట.
శ్రీ కృష్ణుండు పౌండ్రకవాసుదేవుని మీద దండెత్తిపోయి వానిని జంపుట.
బలరాముండు ద్వివిదుడను వానరుని సమ్హరించుట.
బలరాముండు హస్తినా పురమును గంగలో ద్రోయ బూనుట.
షోడశ సహస్ర స్త్రీ సంగతుండైన శ్రీ కృష్ణుని మహిమ నారదుండరయుట.
నారదుండు శ్రీ కృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని సెప్పుట.
శ్రీ కృష్ణుండుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి పోవుట.
పాండవులు శ్రీ కృష్ణుని తోడ్కొని పోవుట.
ధర్మరాజు శ్రీ కృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయంబునకు బంపుట.
శ్రీ కృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట.
శ్రీ కృష్ణ సహాయుందగు భీముండు జారాసంధునితో యుద్ధము సేయుట.
కారా గృహ విముక్తులగు రాజులు శ్రీ కృష్ణుని స్తుతించుట.
ధర్మరాజు చేసేడి రాజసూయంబు నందు శ్రీ కృష్ణుండు శిశుపాలుని వధించుట.
సాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకా పురిపై దండెత్తుట.
శ్రీ కృష్ణుండు దంతవక్త్రుని సమ్హరించుట.
బలరాముండు తీర్థ యాత్రకు జనుట.
కుచేలోపాఖ్యానము.
శ్రీ కృష్ణుండు సకుటుంబముగ గ్రహణ స్నానమునకు బోవుట.
లక్షణ యను శ్రీ కృష్నుని యష్టమ భార్య ద్రౌపదీదేవికి తన వివాహ వృత్తంతము దెలుపుట.
నారదాది మహర్షులు స్రీ కృష్ణ దర్శనంబు సేసికొని వసుదేవునిచే క్రతువు చేయించుట.
శ్రీ కృష్న బలభద్రులు మృతులైన తన సహోదరుల దెచ్చి దేవకీదేవికి కనబఱచుట. సుభద్రా పరిణయము.
స్రీ కృష్ణుండు ఋషి సమేతుండయి మిథిలా నగరమునకు బోవుట.
శ్రుతిగీతలు.
పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యము సెప్పుట.
శివ ద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణు మాయచే మడియుట.
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యము శోధించుటకు బోవుట.
శ్రీకృష్ణుండు మృతులైన విప్ర సుతులను దెచ్చుట.
దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము సమాప్తము.